
ప్రస్తుతం సినీ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న పేరు ‘రాజాసాబ్(Rajasaab)’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా నటిస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవల విడుదలైన టీజర్(teaser) సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా ప్రభాస్ తన పాత చిత్రాల్లో కనిపించిన తరహాలో హాస్యభరితమైన పాత్రలో కనిపిస్తుండటం, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్(VFX) ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ టీజర్ క్రేజ్‌ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు(Hyderabad Traffic Police) రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు వినూత్నంగా ఉపయోగించుకున్నారు.
ప్రభాస్ డైలాగులను చాలా తెలివిగా ఉపయోగించారు..
‘రాజాసాబ్’ టీజర్‌లోని ‘బండి కొంచెం మెల్లగా’, ‘అసలే మన లైఫ్ అంతంతమాత్రం’ వంటి డైలాగులను సద్వినియోగం చేసుకుంటూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ ప్రత్యేక అవగాహన వీడియో(Special Video)ను రూపొందించారు. ఈ వీడియోలో ప్రజలకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన(Awareness of traffic rules) కల్పించడానికి ప్రభాస్ డైలాగులను చాలా తెలివిగా ఉపయోగించారు. ప్రభాస్ నటించిన ‘Sahoo’ చిత్రంలోని “ఇట్స్ షో టైమ్” అనే డైలాగుతో వీడియో ప్రారంభించి, ఆ వెంటనే, మితిమీరిన వేగంతో వెళ్తున్న ఒక బైక్ దృశ్యం కనిపిస్తుంది. అప్పుడు ‘రాజాసాబ్’ టీజర్‌లోని “హలో హలో బండి కొంచెం మెల్లగా” అనే డైలాగ్ వినిపిస్తుంది.
హెల్మెట్ తీస్తున్న సన్నివేశాన్ని చూపిస్తూ..
దీనికి కొనసాగింపుగా, ‘Mirchi’ సినిమాలో ప్రభాస్ నెమ్మదిగా బైక్‌పై వెళ్తున్న సన్నివేశాన్ని జోడించారు. ఆ తర్వాత ‘రాజాసాబ్’లోని “అసలే మన లైఫ్ అంతంతమాత్రం” అనే డైలాగ్ ప్లే అవుతుంది. చివరగా ‘మిర్చి’ సినిమాలోని ప్రభాస్ హెల్మెట్ తీస్తున్న సన్నివేశాన్ని చూపిస్తూ, “హెల్మెట్ ధరించండి, నెమ్మదిగా వెళ్లండి” అనే స్పష్టమైన సందేశాన్ని ప్రజలకు అందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా(SM)లో తెగ వైరల్ అవుతోంది.
#HYDTPweBringAwareness
📢ℋℯ𝓁𝓁ℴ… ℋℯ𝓁𝓁ℴ….!
బండి కొంచెం మెల్లగా #𝕯𝖗𝖎𝖛𝖊 చేయండి డార్లింగ్❤️𝖉𝖆𝖗𝖑𝖎𝖓𝖌.
🏍️#WearHelmet#DarlingPrabhas #TheRajaSaab pic.twitter.com/OHSeM6kd1D— Hyderabad Traffic Police (@HYDTP) June 17, 2025