
అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), సమంత (Samantha) కలిసి నటించిన రొమాంటిక్ డ్రామా ‘ఏ మాయ చేసావె’ (Ye Maaya Chesave). దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ మూవీ మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని జులై 18న రీరిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే మేకర్స్ ప్రకటించారు. అయితే రీరిలీజ్ సందర్భంగా సమంత, చైతన్య కలిసి ప్రమోషన్ల(Promotions)లో పాల్గొంటారన్న ప్రచారం సోషల్ మీడియా(SM) వేదికగా జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సమంత తాజాగా స్పందించింది. తాను ఎలాంటి ప్రమోషన్లలోనూ పాల్గొనడం లేదని స్పష్టం చేసింది. ఆ వార్తలు ఫేక్ ఆమె క్లారిటీ ఇచ్చింది.
ఈ మూవీ ఎప్పటికీ నా మదిలో నిలిచి ఉంటుంది..
ఇంకా సమంత ఏమన్నదంటే.. ‘చిత్రబృందం తరఫున ప్రమోషన్లలో నేను పాల్గొనట్లేదు. ప్రస్తుతం ప్రమోషన్స్ ఈవెంట్స్‌కు నేను దూరంగా ఉన్నా. ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియడం లేదు. ప్రేక్షకులు(Fans) మనసులో కలిగించుకున్న ఊహలు ఇలా పుకార్లుగా మారుతున్నాయి. ఎవరి జీవితం కూడా ప్రజాదృష్టికోణంపై ఆధారపడి ఉండదు’’ అని సమంత స్పష్టం చేసింది. కాగా ‘జెస్సీ(Jessy), కార్తీక్(Karthik)లపై షూట్ చేసిన ఇంటి గేట్ సీన్ నా తొలి షాట్. కెరీర్ ఆరంభంలోనే దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మేనన్(Gautham Vasudev Menon)తో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ సినిమా ఎప్పటికీ నా మదిలో చిరస్థాయిగా నిలిచి ఉంటుంది’ అని సామ్ చెప్పుకొచ్చింది.
No Jessie in Sight: Samantha Clears the Air on Ye Maaya Chesave Re-Release Promotions.#Samantha #YeMayaChesave #rerelease https://t.co/cysNl7m0n8
— Telugu Feed (@Telugufeedsite) June 18, 2025