
కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరస్వామి(Sri Venkateswara Swamy)వారిని దర్శించుకునేందుకు భక్తులు(Devotees) భారీగా తరలివచ్చారు. దీంతో తిరుమల(Tiruala)లో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం ఉదయం కూడా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోందని టీటీడీ(Tirumala Tirupathi Devasthanam) తెలిపింది. ఇప్పటికే భక్తులతో అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయని, భక్తులు కృష్ణతేజ గెస్ట్ హౌస్(Krishnateja Guest House) బయటి వరకు క్యూలైన్లలో నిలిచి ఉన్నారని పేర్కొంది.
వేసవి సెలవులు ముగియడంతో పాటు స్కూళ్ల తెరుచుకుంటుండగా పిల్లలతోపాటు తల్లిదండ్రులు భారీగా స్వామి వారి దర్శనానికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే బుధవారం భక్తుల రద్దీ సాధారణం కంటే అత్యధికంగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న 80,440మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 33,687 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.47కోట్లు సమకూరినట్లు టీటీడీ ప్రకటించింది. కాగా గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఉంజల్ సేవలు ఉంటాయని టీటీడీ తెలిపింది.