Ghaati: ప్రమోషన్స్‌ ఊసే లేదుగా.. ‘ఘాటి’ విడుదల మళ్లీ వాయిదా పడుతుందా?

సొట్టబుగ్గల సుందరి అనుష్క శెట్టి(Anushka Shetty), డైరెక్టర్ క్రిష్(Krish) కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ఘాటి(Ghaati)’. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. అనుష్క మరోసారి లేడీఓరియెంట్‌గా నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ‘ఘాటి’ గ్లింప్స్(Glimpse) వీడియో చూస్తే అదే అనిపిస్తుంది. ఇందులో అనుష్క లుక్, స్క్రీన్ ప్రజెన్స్ ఫ్యాన్స్‌కి విజువల్ ట్రీట్ అందించాయి. చాలా గ్యాప్ తర్వాత అనుష్క ఓ పవర్ ఫుల్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అనిపించింది. ‘ఘాటి’లో అనుష్క గంజాయి స్మగ్లింగ్ రాణిగా కనిపించనుంది. ఒకప్పుడు అమాయకురాలైన మహిళలను అనుకోని పరిస్థితులు, చేదు అనుభవాల ఎలా ఒక క్రూరమైన నేర ప్రపంచానికి నాయకురాలిగా మార్చాయనేది సినిమా స్టోరీగా తెలుస్తోంది.

Image

విడుదల తేదీ దగ్గరపడుతున్నా..

‘వేదం(Vedam)’ తర్వాత అనుష్క శెట్టి, డైరెక్టర్ క్రిష్ కాంబోలో రాబోతున్న రెండవ చిత్రం ‘ఘాటి’. ఈ మూవీ జులై 11న థియేటర్లలో విడుదల కానుంది. అయితే విడుదల తేదీ దగ్గరపడుతున్నా.. ఎటువంటి ప్రమోషన్స్(Promotions) సందడి కనిపించడం లేదు. పైగా విడుదలకు మూడు వారాలే ఉన్నప్పటికీ .. మేకర్స్ ఇంకా ప్రచార కార్యక్రమాలను షురూ చేయలేదు. కనీసం మూవీ ట్రైలర్(Traier), టీజర్(Teaser) అప్డేట్స్ కూడా లేకపోవడంతో స్వీటీ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీని తొలుత ఏప్రిల్ 18న విడుదల చేయాలని భావించగా.. అనివార్య కారణాల వల్ల జులై 11కి వాయిదా పడింది. ఇప్పుడు ఈ తేదీపైనా అనుమాలను తలెత్తుతున్నాయి. మేకర్స్ రెస్పాన్స్ లేకపోవడంతో మళ్లీ వాయిదా పడుతుందని సినీవర్గాల్లో చర్చ నడుస్తోంది.

మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పిన స్వీటీ

కాగా UV క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో అనుష్క శెట్టి లీడ్ రోల్లో నటిస్తుండగా.. విక్రమ్ ప్రభు, ఆది పినిశెట్టి(Aadi Pinishetty), రమ్యకృష్ణ, జగపతిబాబు(Jagapathi babu), చైతన్య రావు మాదడి, రాఘవ్ రుద్ర ముల్పురు, రవీంద్ర విజయ్, దేవికా ప్రియదర్శిని, లారిస్సా బోనేసి, విటివి గణేష్, జ్వాలా కోటి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా ఘాటి విడుదల కాకముందే అనుష్క మలయాళంలో ‘కత్తనార్: ది వైల్డ్ సోర్సె‌రర్’ అనే మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ సినిమా రెండు పార్టుల్లో రానుంది.

Anushka Shetty: కథనార్ – ది వైల్డ్ సోర్సెరర్ గ్లింప్స్.. మరోసారి  భయపెట్టడానికి రేడే అవుతున్న...

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *