ప్రేమ కథలను అందంగా తెరకెక్కించే శేఖర్ కమ్ముల తన పంథాకు భిన్నంగా డబ్బు చుట్టూ తిరిగే కథతో రూపొందించిన చిత్రం ‘కుబేరా’. ధనుష్ (Dhanush), నాగార్జున (Nagarjuna), రష్మిక (Rashmika) కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా నేడు (శుక్రవారం 20 జూన్)న ప్రేక్షకుల ఎదుటకు వచ్చింది. తెలుగుతోపాటు పలు భాషల్లో విడుదలైంది.
ధనవంతుడు, బిచ్చగాడికి మధ్య జరిగే పోరాటం
అత్యంత ధనవంతుడు, ఏమీ ఆశించని ఓ బిచ్చగాడికి మధ్య జరిగే పోరాటమే కుబేరా. బిచ్చగాడి పాత్రలో ధనుష్ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ కనబరిచారు. నాగార్జున, రష్మిక పాత్రలు కీలక రోల్ పోషించాయి. నాగార్జున సెటిల్డ్ నటన ఆకట్టుకుంది. శేఖర్ కమ్ముల ఫస్టాప్ అద్భుతంగా తెరకెక్కించారు. ముఖ్యంగా ధనుష్ ఎంట్రీ తర్వాత మూవీ మరో స్థాయికి వెళ్లింది. రష్మిక తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పవచ్చు.
ప్లస్‌లు, మైనస్‌లు ఇవే..
అయితే సెకండాఫ్ ఫ్రీ క్లైమాక్స్‌లో కాస్త సాగదీతగా అనిపించింది. మూవీ రన్ టైమ్ 3 గంటలపైనే ఉండడంతో కొన్ని చోట్ల మినహా సినిమా బోర్ కొట్టకుండా ముందుకు సాగుతుంది. కొన్ని సన్నివేశాల్లో శేఖర్ కమ్ముల (Shekar kammula) తన బెస్ట్ ఇచ్చారు. తన దర్శకత్వం ఎంత ప్రత్యేకమో ఈ చిత్రంతో మరోమారు చాటి చెప్పారు. ప్రధానంగా మూవీ కథతోపాటు డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్శన. స్లో స్టార్ట్, కొన్ని సాగదీత సీన్లు మైనస్.








