
ఇంగ్లండ్(England)తో జరుగుతున్న తొలి టెస్టులో భారత వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్(Rishabh Pant) బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 సిక్సులు, 12 ఫోర్ల సాయంతో 134 రన్స్ చేసిన ఈ లెఫ్టాండర్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో 131 బంతుల్లో 3 సిక్సులు, 15 ఫోర్లతో సెంచరీ(118) పూర్తి చేసుకున్నాడు. దీంతో ఇంగ్లండ్‌లో ఒకే టెస్టులో రెండు సెంచరీలు చేసిన తొలి వికెట్ కీపర్‌గా పంత్ రికార్డు సృష్టించాడు. ఓవరాల్‌గా రెండో వికెట్ కీపర్‌గా నిలిచాడు.
ఆ తర్వాత వేగంగా ఆడే క్రమంలో బషీర్ బౌలింగ్‌లో క్రాలీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మరో ఎండ్‌లో కేఎల్ రాహుల్(113*) సైతం భారీ శతకంతోపాటు కరుణ్ నాయర్(0*) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ స్కోరు రెండో ఇన్నింగ్స్‌లో 287/4తో ఉండగా.. ఫస్ట్ ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని మొత్తం 293 రన్స్ ఆధిక్యంలో కొనసాగుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్ 4 రన్స్ చేయగా, సాయి సుదర్శన్ 30, గిల్ 8 రన్స్ చేసి ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో కార్స్ రెండు, స్టోక్స్ ఒక వికెట్ తీశారు.
Take a bow, Rishabh Pant 🙇🔥💯#RishabhPant #indvseng #ENGvsIND #milestone #record pic.twitter.com/kILoPpGnL2
— Cricbuzz (@cricbuzz) June 23, 2025