
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా లక్ష రూపాయలకు పైన పలికిన పుత్తడి ధరలు (Gold Price Hike) ప్రస్తుతం కాస్త తగ్గుముఖం పట్టాయి. బంగారం ధరలు తగ్గడానికి అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు ఒక కారణం అయితే, మరో వైపు అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం వల్ల బంగారం రేటు పతనమైనట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇలా…
ఇక బుధవారం (జూన్ 25) హైదరాబాద్ బులియన్ మార్కెట్(Hyderabad Bullion Market)లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర (Gold Rate Today) 10 గ్రాముల పసడి రేటు రూ.270 తగ్గి రూ.98,950 వద్ద ట్రేడవుతోంది. అటు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250 తగ్గి ప్రస్తుతం రూ.90,700 వద్ద కొనసాగుతోంది. అటు ఏపీలోని విజయవాడ(Vijayawada), విశాఖపట్నం(Vizag)లోనూ దాదాపు ఇవే ధరలు అమలులో ఉన్నాయి. మరోవైపు వెండి ధరలు (Silver Rate Today) పెరిగాయి. నిన్న కిలో వెండి ధర రూ.1,19,000 ఉండగా, ఈరోజు రూ.1000 తగ్గి రూ.1,18,000కు చేరుకుంది. ఇక అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ(Rupee Value) రూ.86.92గా నమోదైంది.