
టీమ్ఇండియా(Team India) టీ20 క్రికెట్ జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadhav)కు సర్జరీ జరిగింది. కొంతకాలంగా సూర్య స్పోర్ట్స్ హెర్నియా(Sports Hernia) సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు కుడివైపు పొత్తికడుపు కింది భాగంలో వైద్యులు సర్జరీ నిర్వహించారు. ఈ విషయాన్ని సూర్యకుమార్ సోషల్ మీడియా(Social Media) ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తనకు శస్త్రచికిత్స(Surgery) సజావుగా జరిగిందని, ప్రస్తుతం కోలుకుంటున్నానని SKY తెలిపాడు.
బంగ్లాదేశ్ సిరీస్కు దూరం
“నాకు స్పోర్ట్స్ హెర్నియాకు సంబంధించి కుడివైపు పొత్తికడుపు కింది భాగంలో శస్త్రచికిత్స జరిగింది. సర్జరీ సాఫీగా పూర్తయినందుకు సంతోషంగా ఉంది. ప్రస్తుతం కోలుకుంటున్నాను. మళ్లీ మైదానం(Ground)లోకి తిరిగి రావడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను” అని సూర్య తన పోస్టులో పేర్కొన్నాడు. కాగా T20 టీమ్ కెప్టెన్(Captain)గా, టీ20 ఫార్మాట్లో కీలక ప్లేయర్గా ఉన్నాడు. గాయం కారణంగా వచ్చే ఆగస్టులో జరిగే బంగ్లాదేశ్(Bangladesh) సిరీస్కు సూర్య దూరం కానున్నట్లు సమాచారం. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్(Shreyas Ayyar) కెప్టెన్సీ చేసే ఛాన్సుంది.
View this post on Instagram