అతడు భారత జట్టు టీ20 వరల్డ్ కప్ (T20WC-2007) కొట్టిన జట్టులో కీలక సభ్యుడు.. 2011 వన్డే ప్రపంచకప్ నెగ్గడంలోనూ ముఖ్యపాత్ర పోషించాడు. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ(CT-2013) గెలవడంలోనూ తనదైన ముద్ర వేశాడు. టెస్టుల్లో భారత్ తరఫున వరుసగా ఐదు మ్యాచుల్లో సెంచరీ చేసిన ఏకైక ప్లేయర్.. IPLలో కోల్‌కతా(KKR) జట్టుకు రెండు టైటిళ్లు అందించిన కెప్టెన్.. ఇదంతా ఎవరి గురించో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. అదే టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir). తన తోటి వాళ్లంతా ఇప్పటికీ ఏదో ఒక లీగ్‌లో క్రికెట్ ఆడుతూనే ఉన్నారు. కానీ అతడు మాత్రం ఆటకు గుడ్ బై చెప్పి కోచింగ్(Coaching) వైపు అడుగులు వేశాడు. అంతేకాదు తనకు కావాల్సిన డిమాండ్లను అడిగి మరి నెగ్గించుకుని 44 ఏళ్లకే టీమ్ఇండియా హెడ్ కోచ్(Team India Head Coach)గా పగ్గాలందుకున్నాడు. కానీ, పరిస్థితులు చూస్తుంటే మాత్రం అతడికి కాలం కలిసిరావట్లేదనే చెప్పాలి.
)
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ చేతిలో పరాజయాలు
ఎందుకంటే, గంభీర్ టీమ్ ఇండియా హెడ్ కోచ్ అయిన వెంటనే గత ఏడాది జులైలో శ్రీలంక పర్యటన(Srilanka Tour) వచ్చింది. రోహిత్‌శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి(Virat Kohli)లను రెస్ట్ మాన్పించి మరీ తీసుకొచ్చినా అక్కడ ODI సిరీస్ కోల్పోయింది. ఇలా జరగడం 1997 తర్వాత తొలిసారి కావడం గమనార్హం. ఆ తర్వాత వెంటనే స్వదేశంలో బంగ్లాదేశ్(Bangladesh) వంటి బీ గ్రేడ్ జట్టుపై టెస్టు సిరీస్ గెలిచింది. కానీ, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా న్యూజిలాండ్(New Zealand) చేతిలో స్వదేశంలో టెస్టు సిరీస్‌ను 0-3తో కోల్పోయింది. దీంతోనే గంభీర్‌పై తీవ్ర స్థాయి విమర్శలు వచ్చాయి. ఇక ఆ తర్వాత ఆస్ట్రేలియా(Australia) పర్యటనలో బోర్డర్-గావస్కర్ ట్రోఫీ (BGT)లో తొలి టెస్టును నెగ్గినా.. తర్వాత 3 ఓడిపోయి టీమ్ ఇండియా సిరీస్ కోల్పోయింది. దీంతోపాటే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC-2025) ఫైనల్ బెర్తు చేజార్చుకుంది.

కొత్త WTC 2025-27 సైకిల్‌లోనూ అదే పరిస్థితి..
తాజాగా కొత్త WTC 2025-27 సైకిల్‌లో కొత్త కెప్టెన్, కొత్త కూర్పుతో టీమ్ ఇండియా శుభారంభం చేస్తుందని అభిమానులు భావిస్తే తాజాగా ఇంగ్లండ్(England) చేతిలో గెలవాల్సిన మ్యాచులో తేలికగా ఓడిపోయింది. అంటే గంభీర్ బాధ్యతలు చేపట్టాక మొత్తం 11 టెస్టులు ఆడితే భారత్ 3 మాత్రమే గెలిచింది అన్నమాట. ఒకటి డ్రా కాగా.. 7 ఓడింది. ముఖ్యంగా చివరి 9 టెస్టులలో ఒకటే గెలిచింది. టెస్టులు ఆడే ప్రధాన జట్లలో గత 9 మ్యాచ్‌లలో అత్యల్ప విజయాలు నమోదు చేసినది ఇప్పుడు టీమ్ ఇండియానే. దీంతో తాజాగా ఇంగ్లండ్ సిరీస్ కూడా భారత్ ఓడితే గౌతీకి కష్టకాలం మొదలైనట్లే. మరో రెండేళ్లు పదవీకాలం ఉన్నప్పటికీ.. ముందే తప్పుకోవాల్సి రావొచ్చని క్రీడా విశ్లేషకుల అభిప్రాయం.
Three coaches, three eras, and a rollercoaster of results! 🎢
It’s still early days in Gambhir’s coaching journey…
While white-ball results show promise, the Test format remains a tough nut to crack. 🤔#ENGvIND #TestCricket #GautamGambhir #Sportskeeda pic.twitter.com/MtHNDDRZgm
— Sportskeeda (@Sportskeeda) June 26, 2025






