కన్నప్ప సినిమాకు ప్రభాస్ కంటే ముందు ఆ స్టార్ హీరో అనుకున్నారట? ఆ హీరో ఎవరంటే..

శివభక్తుడైన కన్నప్ప జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘కన్నప్ప’(Kannappa) సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచు విష్ణు(Vishnu Manchu) ప్రధాన పాత్ర పోషించిన ఈ భారీ చిత్రంలో ప్రభాస్(Prabhas), మోహన్‌లాల్(Mohanlal), మోహన్ బాబు(Mahan Babu), అక్షయ్ కుమార్(Akhay Kumar), కాజల్ అగర్వాల్(Kajal Agarwal) వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో కనిపించారు. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు మొదలవడంతో సినిమా చూసిన పలువురు ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు.

మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ దాదాపు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, విజువల్స్, కథనశైలి, విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ప్రత్యేకంగా నిలిచింది.

ఈ సినిమాలో ప్రభాస్ రుద్ర అవతారంలో ప్రత్యేక పాత్రలో మెరిశారు. అరగంటపాటు కనిపించినప్పటికీ ప్రభాస్ ఎంట్రీకి థియేటర్లలో విపరీతమైన స్పందన వచ్చింది. అతను నటించిన సన్నివేశాలు, డైలాగులకు ఫ్యాన్స్ నుంచి శభాష్ అనిపించుకున్నాయి. ముఖ్యంగా విష్ణు–ప్రభాస్ మధ్య వచ్చే సీన్లు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి.

అయితే ఇప్పుడు ఈ సినిమాలో ప్రభాస్ పోషించిన రుద్ర పాత్రకు సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మొదట ఈ పాత్రకు ఎన్టీఆర్(Jr NTR) పేరును పరిశీలించారట. మంచు విష్ణు కూడా మొదట రుద్ర పాత్రకు ఎన్టీఆర్‌ను అనుకున్నట్టు సమాచారం. కానీ, మోహన్ బాబు సహా పలువురు ప్రభాస్‌ను తీసుకుంటేనే బాగా పని చేస్తుందని విష్ణుకు సూచించారట.

దాంతో విష్ణు ప్రభాస్‌ను సంప్రదించి, ఈ ముఖ్యమైన పాత్రలో నటించమని కోరినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రభాస్ అంగీకరించగా, ఆయన ఎంట్రీతో సినిమాకు మరింత హైప్ వచ్చింది. ఈ వార్తలో నిజమెంతనేది అధికారికంగా స్పష్టం కాకపోయినా, రుద్ర పాత్రలో ప్రభాస్‌ అదరగొట్టాడని అభిమానులు గర్వంగా చెబుతున్నారు. మొత్తానికి ‘కన్నప్ప’ సినిమా మంచు ఫ్యామిలీ అభిమానులతో పాటు ప్రభాస్ ఫ్యాన్స్‌కు కూడా మంచి వినోదాన్ని అందిస్తూ బ్లాక్‌బస్టర్‌గా దూసుకెళుతోంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *