గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో(Ram Charan), కియారా అద్వానీ(Kiara Advani) జంటగా వచ్చిన మూవీ ‘గేమ్ ఛేంజర్(Game Changer)’. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్(Box Office) వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఈ మూవీ రిజల్ట్స్‌పై నిర్మాత శిరీష్(Producer Sirish) గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ వివాదానికి శిరీష్ స్వయంగా తెరదించే ప్రయత్నం చేశారు. తన మాటల వల్ల మెగా అభిమానులు బాధపడ్డారని గ్రహించి, వారికి క్షమాపణ(Apology) చెబుతూ ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు.

వివాదం ఇదీ..
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో శిరీష్ మాట్లాడుతూ… ‘గేమ్ ఛేంజర్’ చిత్రం విడుదలైన తర్వాత హీరో రామ్ చరణ్(Ram Charan) గానీ, దర్శకుడు శంకర్(Director Shankar) గానీ తమకు ఫోన్ చేయలేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. మెగా అభిమానులు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్(Sri Venkateswara Creations Banner)ను, నిర్మాతలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. తమ హీరో సినిమాకు పూర్తి సహకారం అందించినా, ఈ విధంగా మాట్లాడటం సరికాదని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలా ఎప్పటికీ మాట్లాడను: శిరీష్
ఈ నేపథ్యంలోనే శిరీష్ వెంటనే స్పందించి వివాదాన్ని చల్లార్చేందుకు బహిరంగ లేఖ(Letter)ను విడుదల చేశారు. తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని, మెగా అభిమానుల(Mega Fans) మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని ఆ లేఖలో స్పష్టం చేశారు. ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ సమయంలో రామ్ చరణ్ తమకు పూర్తి సమయాన్ని కేటాయించి, సంపూర్ణ సహకారం అందించారని ఆయన పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), రామ్ చరణ్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా తాను ఎప్పటికీ మాట్లాడనని శిరీష్ హామీ ఇచ్చారు. ఒకవేళ తన వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే, క్షమించాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.
Producer #Shirish statement about the controversy pic.twitter.com/vQCbNoYgEX
— Tollywood Box Office (@Tolly_BOXOFFICE) July 1, 2025






