దేశంలో అత్యంత ఆధ్యాత్మిక యాత్రల్లో ఒకటైన అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra 2025)కు సర్వం సిద్ధమైంది. 38 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఆగస్టు 9వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ యాత్ర కోసం ఇప్పటికే అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. కాగా దీనికోసం ఈ సంవత్సరం పెద్ద మొత్తంలో రిజిస్ట్రేషన్లు(Registrations) వచ్చాయి. అయితే మొన్నటి వరకు భారీ వర్షాలు(Heavy Rains) కురిసిన నేపథ్యంలో అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. దీంతో మొదటి బ్యాచ్ (First batch)ను ఈ రోజు జమ్మూకశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా(Governor Manoj Sinha) జెండా ఊపి ప్రారంభించారు. ఈ మేరకు జమ్మూ నుంచి తొలి బ్యాచ్ బయలుదేరింది.
Flagged off first batch of pilgrims of Shri Amarnath Ji Yatra-2025 from Bhagwati Nagar Base Camp. Wishing all spiritual seekers a safe & comfortable journey to the holy abode of Lord Shiva and deeply soul-stirring experience. Prayed to Baba Amarnath for peace & blessings to all. pic.twitter.com/2JIoxvAD4G
— Office of LG J&K (@OfficeOfLGJandK) July 2, 2025
42,000 మంది జవాన్లతో భద్రత
పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam terror attack) నేపథ్యంలో ఈ యాత్రకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా అమర్నాథ్ యాత్ర మార్గాన్ని నో ఫ్లైజోన్(No Fly Zone)గా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ యాత్ర బాల్తాల్, పహల్గామ్ మార్గాల ద్వారా ప్రారంభమై, ఆగస్టు 9న రక్షా బంధన్ రోజు ముగుస్తుంది. భద్రతా కారణాలతో, 42,000 మంది జవాన్లతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. RFID ట్యాగ్ల ద్వారా యాత్రికుల కదలికలను పర్యవేక్షిస్తున్నారు.






