పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu). ఈ సోషియో ఫాంటసీ చిత్రం కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అనేక వాయిదాల అనంతరం, చివరికి ఈ చిత్రాన్ని జూలై 24న విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ బజ్ నడుమ జూలై 3న ఉదయం 11:10 గంటలకు ఈ మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ను (Hari Hara Veeramallu Trailer) గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఇతర సినిమాల మాదిరిగా యూట్యూబ్ లేదా సోషల్ మీడియా వేదికలకే పరిమితం కాకుండా, ఈసారి ట్రైలర్ను ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లోని 29 ప్రధాన థియేటర్లలో విడుదల చేయనుండటం విశేషం. ఇందులో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, చిత్తూరు, ఒంగోలు వంటి నగరాలు ఉన్నాయి. థియేటర్ల వద్దే ట్రైలర్ను వీక్షించేందుకు పవన్ అభిమానులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, డీజే వేడుకలతో థియేటర్స్ వద్ద పండుగ వాతావరణం నెలకొననుంది.
ట్రైలర్ ఎలా ఉండనుందంటే.. ఈ ట్రైలర్ అత్యున్నత స్థాయిలో ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ మాస్ అవతారంలో పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకోనున్నాడని, ఇది ఇప్పటి వరకూ వచ్చిన ట్రైలర్లను మించి ఉంటుందని చెబుతున్నారు. ప్రముఖ నిర్మాత ఏ.ఎం. రత్నం ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో మెరవబోతున్నాడు. ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దర్శకత్వ బాధ్యతలు క్రిష్ – జ్యోతికృష్ణ చేపట్టారు. రాబోయే రోజుల్లో హరిహర వీరమల్లుకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ వదిలి సినిమాపై భారీ హైప్ వచ్చేలా మేకర్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం.






