Allu Aravind: ఈడీ విచారణపై అల్లు అరవింద్ ఏమన్నారంటే?

ప్రముఖ తెలుగు సినీ నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. రూ. 101.4 కోట్ల రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కామ్ కేసు(Ramakrishna Electronics Bank Scam Case)లో ఆయన్ను ఈడీ అధికారులు మూడు గంటలపాటు ప్రశ్నించారు. ఈ విషయంపై అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడి క్లారిటీ ఇచ్చారు. తాను 2017లో ఒక ప్రాపర్టీ కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ లావాదేవీలో ఒక మైనర్ వాటాదారుడు బ్యాంక్ లోన్ తీసుకొని దాన్ని చెల్లించలేకపోయాడని, ఈడీ దర్యాప్తులో ఆ వాటాదారుడి బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌లో తన పేరు కనిపించడంతో విచారణకు పిలిచినట్లు వెల్లడించారు.

బాధ్యతగల పౌరుడిగా ఈడీకి సహకరించాను..

“నేను బాధ్యతగల పౌరుడిగా ఈడీకి సహకరించాను. మీడియాలో ఈ విషయాన్ని తప్పుగా చూపించారు. కేసు దర్యాప్తులో ఉన్నందున మరిన్ని వివరాలు చెప్పలేను” అని ఆయన అన్నారు. కాగా ఈ కేసు రామకృష్ణ ఎలక్ట్రానిక్స్, రామకృష్ణ టెలిట్రానిక్స్ (RTPL) సంస్థలకు సంబంధించిన ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేస్తోంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఫిర్యాదు మేరకు ఈడీ ఈ కేసును చేపట్టింది. అల్లు అరవింద్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ప్రాపర్టీ కొనుగోళ్లపై అధికారులు ప్రశ్నలు సంధించారు. ఈడీ అధికారులు ఆయన్ను వచ్చే వారం మరోసారి విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *