అగ్రరాజ్యం అమెరికా(America)ను భారీ వర్షాలు(Heavy Rains) విలయం సృష్టిస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా USలోని టెక్సాస్(Texas) రాష్ట్రాన్ని భారీ వరదలు(Floods) ముంచెత్తాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు ఇక్కడి నదులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కెర్ కౌంటీలో ఇప్పటివరకు 51 మంది మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు, వీరిలో 15 మంది పిల్లలు, 28 మంది పెద్దలు ఉన్నారు. కాంప్ మిస్టిక్ అనే క్రైస్తవ బాలికల సమ్మర్ క్యాంప్(Girls’ Summer Camp) నుంచి 27 మంది బాలికలు గల్లంతయ్యారని కెర్‌విల్ సిటీ మేనేజర్ డాల్టన్ రైస్(Kerrville City Manager Dalton Rice) తెలిపారు.

తల్లిదండ్రుల తీవ్ర ఆందోళన
ఈ క్యాంప్ గ్వాడాలుపే నది(Guadalupe River) ఒడ్డున ఉంది, ఇక్కడ నీటి మట్టం రెండు గంటల్లో 20 అడుగులకు పైగా పెరిగింది. దీంతో చిన్నారులు కొట్టుకుపోయారు. గల్లంతైన వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాలికల కోసం పడవలు, హెలికాప్టర్ల సాయంతో గాలింపు కొనసాగుతోంది. రెస్క్యూ బృందాలు(Rescue teams) ఇప్పటి వరకూ వందలాది మందిని కాపాడాయి. అయితే ఇంకా 27 మంది ఆచూకీ తెలియలేదు. గవర్నర్ గ్రెగ్ అబాట్ విపత్తు ప్రకటన జారీ చేసి, రాష్ట్ర వనరులను సమీకరించారు. టెక్సాస్ నేషనల్ గార్డ్(Texas National Guard), హెలికాప్టర్లు, రెస్క్యూ బోట్లతో 237 మందిని సురక్షితంగా తరలించింది.
Ya son 51 muertos por las graves #inundaciones en #Texas, entre ellos 14 niños.#Breaking#US #USA #TX pic.twitter.com/BmswUqIIqF
— 𝙈𝙖𝙧𝙞𝙤 𝙈𝙤𝙧𝙖𝙮 (@Mario_Moray) July 6, 2025








