ప్రముఖ పంజాబీ నటి తానియ (Tania) తండ్రిపై గుర్తు తెలియని ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. పాయింట్ బ్లాక్‌లో గన్ను పెట్టి కాల్చాడు. తీవ్రంగా గాయపడ్డ ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. నటి తానియ తండ్రి అనిల్‌జిత్ కాంభోజ్ ఓ డాక్టర్. పంజాబ్ మోగ జిల్లాలో నర్సింగ్ హోమ్‌లో పనిచేస్తున్నాడు. ట్రీట్మెంట్ కోసమంటూ ఇద్దరు వ్యక్తులు ఆయన అనిల్ జిత్ క్యాబిన్లోకి వెళ్లారు. కాలికి ఇన్ఫెక్షన్ సోకిందని చెప్పడంతో అనిల్ అతడి కాలిని పరీక్షిస్తూ ఉండగా.. రెండో తుపాకీతో అనిల్‌పై కాల్పులు జరిపాడు. అనంతరం ఆ ఇద్దరు పారిపోయారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
ఓసారి వచ్చి వెనక్కి వెళ్లి..
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆ దుండగులు అనిల్ కోసం ఉదయం పది గంటల సమయంలో ఓ సారి వచ్చారు. డాక్టర్ లేడని తెలిసి వెనక్కి వెళ్లిపోయారు. మధ్యాహ్నం 12.50కి మళ్లీ వచ్చి డాక్టర్‌పై కాల్పులకు తెగబడ్డారు. అనిల్ శరీరంలోకి రెండు బుల్లెట్లు దిగాయి. ప్రస్తుతం ఆయన ఐసీయూ చికిత్స పొందుతున్నారు. పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని డాక్టర్లు తెలిపారు. అయితే అనిల్‌పై దాడి ఎందుకు చేశారనే విషయం తెలియాల్సి ఉంది.
Punjabi actress Tania’s father, Dr Aniljeet Kamboj, was critically injured in a daylight shooting at his Moga clinic. Two unidentified men shot him and fled. Police probing prior extortion threats and possible security lapses. #Tania #Punjabhttps://t.co/PGE9vSkZO9 pic.twitter.com/L8K0lf8eG5
— Salar News (@EnglishSalar) July 5, 2025






