వెబ్ రియాలిటీ షోలలో సెన్సేషన్‌గా నిలిచిన బిగ్‌బాస్(Bigg Boss) తెలుగు(Telugu) 8 సీజన్లను పూర్తి చేసుకొని త్వరలో 9వ సీజన్‌లోకి అడుగుపెడుతోంది. గత సీజన్‌కు తక్కువ రేటింగ్స్(Retings) రావడంతో మేకర్స్ ఈ సీజన్‌లో భారీ మార్పులు తీసుకురానున్నారు. మళ్లీ అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna)నే హోస్ట్‌గా కొనసాగనుండగా, ఇప్పటికే ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో “గెలవాలంటే యుద్ధం చేయాల్సిందే” అనే సందేశంతో ఈ సీజన్ మరో స్థాయికి వెళ్లనుందని హింట్ ఇచ్చారు.
హౌస్‌లో మార్పులే మార్పులు:
ఈసారి బిగ్‌బాస్ షోను పూర్తిగా కొత్త ఫార్మాట్‌లో ప్లాన్ చేస్తున్నారని టాక్. కంటెస్టెంట్స్ ఎంపిక, నామినేషన్స్(nomination) విధానం, ఎలిమినేషన్ ప్రాసెస్(elimination process), ఓటింగ్(oting) ఇలా అన్నింటిలోనూ మార్పులు తీసుకురానున్నట్లు సమాచారం. గత సీజన్‌లతో పోలిస్తే ఈసారి షో ప్రారంభం కూడా ముందుగా ఉండే అవకాశముంది. జూలై చివర్లో కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తయ్యే సూచనలు ఉన్నాయి.
కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్:
బిగ్‌బాస్ 9లో పాల్గొననున్న వారిగా తేజస్విని గౌడ, కల్పికా గణేష్, కావ్యశ్రీ, నవ్యస్వామి, ఛత్రపతి శేఖర్, ముఖేష్ గౌడ్, జ్యోతిరాయ్, సాయికిరణ్, శ్రావణి వర్మ, బమ్ చిక్ బబ్లూ, ఇమ్మాన్యుయేల్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.
కామన్‌మెన్‌కు గోల్డెన్ ఛాన్స్:
ఈసారి బిగ్‌బాస్ ఓ సరికొత్త అడ్వాన్సెడ్ స్టెప్ తీసుకుంది. సెలబ్రిటీలతో పాటు సామాన్యులను కూడా కంటెస్టెంట్లుగా తీసుకునేలా ప్లాన్ చేశారు. www.bb9.jiostar.com వెబ్‌సైట్ ద్వారా కామన్‌మెన్ అప్లై చేయవచ్చు. లక్షలాది మంది ఇప్పటికే దరఖాస్తు చేశారు. వీరిలో వీడియోలు, స్క్రీన్ ప్రెజెన్స్ ఆధారంగా 200 మందిని షార్ట్‌లిస్ట్ చేస్తారు. చివరగా ప్రజల ఓటింగ్ ఆధారంగా ముగ్గురు కామన్‌మెన్‌ను హౌస్‌లోకి పంపనున్నారు. ఈసారి బిగ్‌బాస్ 9 సీజన్ పూర్తిగా కొత్త కాన్సెప్ట్‌తో, సరికొత్త ఎంటర్టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.






