తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదిగిన అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) ఇటీవల తండేల్ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించగా, బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లను దాటి చైతన్య కెరీర్‌లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.
ఇప్పుడు ఆయన తదుపరి పీరియాడికల్ డ్రామాపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా, గతంలో లాల్ సింగ్ చడ్డా ప్రమోషన్లలో చైతూ చేసిన కొన్ని వ్యాఖ్యలు మళ్లీ నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్‌లో ఎవరితో నటించాలని ఉందని ప్రశ్నించగా, తన ఫస్ట్ క్రష్ సుష్మితా సేన్ అని, ఈ విషయాన్ని ఆమెను కలిసినప్పుడు సైతం చెప్పినట్టు వెల్లడించారు. అలియా భట్ నటనపై అభిమానంతో ఆమెతో అవకాశం వస్తే వదులుకోనని అన్నారు. ప్రియాంక చోప్రా, కరీనా కపూర్, కత్రినా కైఫ్‌తో కూడా పనిచేయాలన్నదే తన కోరిక అని వెల్లడించారు.
View this post on Instagram
తన జీవితంపై బయోగ్రఫీ వస్తే దానికి “జీవితాన్ని అంత సీరియస్‌గా తీసుకోవద్దు” అనే టైటిల్ పెడతానంటూ చెప్పిన చైతూ, “ఒక ఐలాండ్‌లో చిక్కుకున్నా.. మ్యూజిక్ వినడమే సరిపోతుంది. మనసుకు నచ్చిన అమ్మాయితో మాట్లాడుకుంటూ ఆనందంగా గడుపుతాను” అంటూ తన మనసులో మాటలు పంచుకున్నారు.






