థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం పలు సినిమాలు, సిరీస్లు సందడి చేయనున్నాయి. యంగ్ హీరో సుహాస్, మాళవిక మనోజ్ హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ ‘ఓ భామ అయ్యో రామా’ (O Bhama Ayyo Rama). అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జులై 11న థియేటర్లలో రిలీజ్ కానుంది. బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. మొగలి రేకులు ఫేమ్ ఆర్కే సాగర్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘ది 100’ (The 100). మిషా నారంగ్ హీరోయిన్. ఈ మూవీ కూడా జులై 11న ముందుకు రానుంది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ మూవీలో సాగర్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు.
జులై 11న ‘మాలిక్’
రాజ్‌కుమార్ రావ్ (Rajkummar Rao), మానుషి చిల్లర్ (Manushi Chhillar) జోడీగా నటించిన మూవీ ‘మాలిక్’ (Maalik). గ్యాంగ్‌స్టర్ డ్రామా తెరకెక్కిన ఈ మూవీ జులై 11న రిలీజ్ కానుంది. హాలీవుడ్ మూవీ ‘సూపర్‌మ్యాన్’ (Superman).. గీతానంద్, మిత్రా శర్మ జంటగా నటించిన ‘వర్జీన్ బాయ్స్’ (Virgin Boys) కూడా జులై 11నే రిలీజ్ అవుతున్నాయి.
ఇక ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు, సిరీస్లు ఇవే..
నెట్‌ఫ్లిక్స్
* జియామ్ (ఇంగ్లీష్) జులై 9
* సెవెన్ బేర్స్ (యానిమేషన్) జులై 10
* బ్రిక్ (ఇంగ్లీష్) జులై 10
ఆప్ జై సా కోయి (హిందీ) జులై 11
జియో హాట్‌స్టార్
* మూన్ వాక్ (మలయాళం) జులై 08
* స్పెషల్ ఓపీఎస్ (వెబ్‌సిరీస్ సీజన్2) జులై 11
సోనీలివ్
* నరివెట్ట (మలయాళం) జులై 11
బుక్ మై షో
* గుడ్ వన్ (హాలీవుడ్) జులై 08






