IND vs ENG: అతడి వల్లే ఓడిపోయాం: ఇంగ్లండ్ కోచ్ మెక్‌కల్లమ్

ఇంగ్లండ్ జట్టుకు పెట్టని గోడ ఎడ్జ్బాస్టన్లో టీమిండియా రికార్డు స్థాయి స్కోరు చేసి ఆ జట్టును మట్టికరిపించింది. ఫస్ట్ టెస్ట్ ఓటమికి రివెంజ్ తీర్చుకుంది. గిల్ సేన ఆల్రౌండర్ షోతో రెండో టెస్టులో 336 రన్స్ తేడాతో బ్రిటిష్ జట్టుపై (IND vs ENG) ఘన విజయం సాధించింది. బజ్‌బాల్‌తో టెస్టుల్లో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్న ఇంగ్లీష్ జట్టును కోలుకోని దెబ్బ కొట్టింది. ఈ నేపథ్యంలో ఆ జట్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ (Brendon McCullum) తమ జట్టు ఓటమిని అంగీకరించాడు. టీమ్ ఓటమికి కారణాలు తెలుపుతూ.. భారత యువ కెరటంపై ప్రశంసలు కురిపించాడు. అతడి వల్లే తమ జట్టు ఓటమి పాలైందని పేర్కొన్నాడు.

ఆకాశ్ దీప్ ఫలితాన్ని శాసించాడు..

ఆకాశ్‌దీప్ (Akash Deep) అద్భుతంగా బౌలింగ్ చేశాడని.. ఎడ్జ్బాస్టన్ పిచ్‌పై అతడి బంతులు ఫలితాన్ని శాసించాయని అన్నాడు. ‘మ్యాచ్ సాగుతున్న కొద్దీ టాస్ దగ్గరే మేం అవకాశాన్ని కోల్పోయామని అర్థమైంది. వికెట్ ఇలా ప్రవర్తిస్తుందని అనుకోలేదు. భారత్‌ను తక్కువ స్కోరుకు కట్టడి చేయలేకపోయాం. 580కి పైగా పరుగులు చేస్తుందని ఊహించలేదు. అక్కడే మేం ఆటలో వెనుకబడ్డాం. జేమీ స్మిత్, హ్యారీ బ్రూక్ భాగస్వామ్యం వల్ల గేమ్‌లో కొంతమేర సమతూకం తీసుకురాగలిగాం. కానీ ఆకాశ్‌దీప్ ఆట గమనాన్ని మార్చేసింది’ అని మెక్కల్లమ్ పేర్కొన్నాడు. పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేశాడని ప్రశంసించాడు.

10 Wickets. One Stage. Akash Deep Has Truly Arrived - Rediff.com

బుమ్రా ఆడతాడని తెలుసు.. సన్నద్ధం అవుతాం

ఈ సందర్భంగా బుమ్రా గురించి సైతం మెక్కల్లమ్ మాట్లాడాడు. లార్డ్స్ వేదికగా జరిగే మూడో టెస్ట్‌లో జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఆడతాడనే విషయం తమకు తెలుసని.. కాబట్టి ఆ మ్యాచ్‌కు అన్ని విధాలుగా సన్నద్ధం అవుతామని తెలిపాడు. ఎడ్జ్‌బాస్టన్ వికెట్‌తో పోలిస్తే లార్డ్స్ పిచ్ స్పందించే తీరు విభిన్నంగా ఉంటుందని ఆశిస్తున్నామని పేర్కొన్నాడు.

Jasprit Bumrah On Facing England: 'We're Always Confident Against Ultra-Aggressive Batting' | IND vs ENG | Cricket News Today

10 వికెట్లు తీసిన ఆకాశ్ దీప్

ఫస్ట్ టెస్ట్ ఓటమితో సిరీస్లో వెనుకబడ్డ టీమిండియా రెండో టెస్ట్లో ఇంగ్లాండ్ జట్టును చావుదెబ్బ తీసింది. మొదటి ఇన్నింగ్లో శుభ్మన్ గిల్ డబుల్ సెంచరీకి తోడు జైశ్వాల్, జడేజా ఇన్నింగ్స్లో 587 స్కోరు సాధించిన టీమిండియా.. ఇంగ్లాండ్ను 407 రన్స్కే కట్టడి చేసింది. సిరాజ్ 6 వికెట్లు తీయగా, ఆకాశ్ దీప్ 4 వికెట్లు పడగొట్టాడు. సెకండ్ ఇన్నింగ్లోనూ గిల్ సెంచరీ చేసి 600 పైచిలుకు టార్గెట్ విధించగా.. స్టోక్స్ జట్టు కేవలం 271 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఆకాశ్ దీప్ 6 వికెట్లు పడగొట్టి జట్టుకు విజయాన్నందించాడు. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి అతడు 10 వికెట్లు తీశాడు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *