Akhanda2: అఖండ 2 కోసం రికార్డు స్థాయి బడ్జెట్.. బాలయ్య బిగ్ రిస్క్!

నందమూరి బాలకృష్ణ(Balakrishna), బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అఖండ  2’ (Akanda2) సినిమాపై ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి.. వరుసగా నాలుగు హిట్లు కొట్టి మంచి ఫామ్‌లో ఉన్న బాలయ్య బాబు, ఇప్పుడు తన బ్లాక్‌బస్టర్ హిట్ అఖండ కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘అఖండ 2’ చిత్రంతో మళ్లీ ప్రేక్షకులను అలరించనున్నాడు. ఇటీవలే విడుదలై టీజర్ మంచి రెస్పాన్స్‌ను రాబట్టింది.

‘అఖండ 2’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్నా, ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు బడ్జెట్ అంశం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి ఏకంగా రూ.160 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టినా బాలయ్యకు ఉన్న మార్కెట్‌తో పోలిస్తే పెద్ద రిస్క్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో వచ్చిన అఖండ సినిమా రూ.50–60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా.. రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. కానీ ‘అఖండ 2’కి రూ.160 కోట్ల బడ్జెట్ పెట్టడం అంటే, సినిమా కనీసం రూ.200 కోట్ల బిజినెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది.

బాలయ్య గత చిత్రాలు వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వాణిజ్య పరంగా విజయం సాధించాయి కానీ, ఏదీ రూ.200 కోట్ల మార్కును చేరలేదు. ఈ నేపథ్యంలో ‘అఖండ 2’పై పెట్టిన భారీ పెట్టుబడి సినీ విశ్లేషకుల దృష్టిలో బాలయ్యకు ఇది బిగ్ రిస్క్ లాగా కనిపిస్తోంది.

ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా, బాలయ్య కుమార్తె తేజస్విని కూడా నిర్మాణంలో భాగంగా వ్యవహరిస్తుండడం విశేషం. “అఖండ 2” మేకింగ్ విషయంలో మేకర్స్ ఎక్కడా రాజీ పడటం లేదని, భారీ బడ్జెట్‌తో టెక్నికల్‌గా, విజువల్‌గా అన్ని విధాలుగా ఈ సినిమాను గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారని తెలియడంతో ఈ సినిమాపై ఓ రేంజ్ హైప్ నెలకొంది. మాస్ యాక్షన్, పవర్‌ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాలో హైలైట్ గా నిలుస్తాయట. 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ మాస్ ఎంటర్‌టైనర్‌ను సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *