Elephant: అరుదైన ఘటన.. రైల్వే ట్రాక్‌పైనే ప్రసవించిన ఏనుగు.. చివరకు ఏమైందంటే?

ఝార్ఖండ్‌(Jharkhand)లోని రామ్‌గఢ్ జిల్లాలో జూన్ 25న ఒక హృదయం చలించిపోయే ఘటన చోటుచేసుకుంది. బర్కాకానా-హజారీబాగ్ రైల్వే మార్గం సర్వాహా గ్రామం సమీపంలో ప్రసవ వేదనతో బాధపడుతున్న ఓ ఏనుగు(Elephant) కోసం ఏకంగా రెండు గంటల పాటు రైలు(Train)ను నిలిపివేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ స్ఫూర్తిదాయక ఘటనకు సంబంధించిన వివరాలను కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌(Union Environment Minister Bhupender Yadav) స్వయంగా పంచుకున్నారు.

దాదాపు రెండు గంటలపాటు నిలిచి రైలు

వివరాల్లోకి వెళితే.. ఝార్ఖండ్‌లోని ఒక రైల్వే ట్రాక్‌పైకి వచ్చిన గర్భిణి ఏనుగు(Pregnant elephant) ప్రసవ వేదనతో బాధపడుతోంది. ఇది గమనించిన అటవీ శాఖ అధికారులు వెంటనే రైల్వే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. దీంతో రైల్వే అధికారులు మానవతా దృక్పథంతో కోల్‌తో నిండిన గూడ్స్ రైలును లోకో పైలట్ ట్రాక్‌పైనే నిలిపివేశారు. సుమారు రెండు గంటల నిరీక్షణ తర్వాత ఆ ఏనుగు ఆడ గున్న ఏనుగుకు జన్మనిచ్చింది. అనంతరం తన బిడ్డతో కలిసి నెమ్మదిగా అడవిలోకి వెళ్లిపోయింది. తల్లీబిడ్డ క్షేమంగా వెళ్లేంత వరకు రైలు అక్కడే ఆగి ఉంది.

Goods train halts for 2 hours in Jharkhand as elephant gives birth | India News - Times of India

ఇలాంటి ఘటనలు ఎంతో సంతోషాన్నిస్తాయి: కేంద్ర మంత్రి

బుధవారం తెల్లవారుజాము3 గంటల సమయంలో జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అటవీ శాఖ అధికారి నీతీష్ కుమార్(Forest Department Officer Nitish Kumar) మాట్లాడుతూ, ఏనుగు శిశువు సురక్షితంగా జన్మించే వరకు రైళ్ల రాకపోకలను నిలిపివేశామని తెలిపారు. ఈ ఘటనను అటవీ గార్డ్‌లు, స్థానికులు వీడియో తీశారు. ఇది సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ట్వీట్ చేస్తూ.. మానవులు, జంతువుల మధ్య ఘర్షణ వార్తలు వస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి సామరస్యపూర్వక సంఘటనలు ఎంతో సంతోషాన్నిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఏనుగు ప్రసవానికి సహకరించిన వారి సున్నితమైన మనసును, జార్ఖండ్ అటవీ శాఖ అధికారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *