మొబైల్ లవర్స్(Mobile Lovers)కు అదిరిపోయే న్యూస్ వచ్చేసింది. పైగా ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ల(Smart Phones) వినియోగం విపరీతంగా ఉన్న సంగతి తెలిసిందే. అసలు మొబైల్ లేకపోతే.. ఒక్క పని కూడా జరగడం లేదు. గుమస్తా నుంచి మొదలుకొని ఉన్నత శ్రేణి ఉద్యోగం వరకు.. కచ్చితంగా ఫోన్ ఉండాల్సిందే. అలాగే… జియో(Jio) వచ్చినప్పటి నుంచి స్మార్ట్ ఫోన్లు వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది. దీనికి తగ్గట్టుగానే రకరకాల కంపెనీలు వందల మోడల్స్‌లో తక్కువ ధరకే మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాలలో వరుసగా త్వరలోనే వరుసగా పండుగలు(Festivals) రాబోతున్నాయి.
పండగల సమయంలో…
రక్షాబంధన్(Rakhi), వినాయక చవితి(Vinayaka Chavithi), దసరా(Dasara), దీపావళి(Dipavali) వరకు అన్ని పండుగలే. పండుగ వచ్చిందంటే చాలు స్మార్ట్ ఫోన్ కంపెనీలు అనేక రకాల ఆఫర్లు(Offers) ప్రకటించడం తెలిసిందే. ఇక ఈ ఏడాది కూడా స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఆఫర్లు ప్రకటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరున్( Tarun Pathak, Research Director at Counterpoint) కూడా అధికారిక ప్రకటన చేశారు. ఈ సంవత్సరం తొలి ఆరు నెలల్లో సేల్స్(Sales) పడిపోవడం కారణంగా ఆగస్టు నుంచి.. ఆఫర్లు పెట్టబోతున్నారట. ఆరు నెలల పాత స్టాక్‌ను క్లియర్ చేయాలని అన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీలు భావిస్తున్నాయట. ముఖ్యంగా వన్‌ప్లస్, షియోమీ, ఐక్యూ, రియల్మీ, ఒప్పో, నథింగ్ ఫోన్ బ్రాండ్లపై 25 శాతం నుంచి 50% వరకు డిస్కౌంట్లు(Discounts) కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.






