హైదరాబాద్(Hyderabad)లోని కూకట్‌పల్లిలో కల్తీ కల్లు(Kalthi Kallu) తాగి అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో బాధితుల సంఖ్య 44కి చేరగా, ఇప్పటివరకు ఆరుగురు మృతి(Six Died) చెందినట్లు తెలుస్తోంది. మృతులు స్వరూప (56), తులసిరామ్ (47), బొజ్జయ్య (55), నారాయణమ్మ (65), మౌనిక (25), నారాయణ (42)గా గుర్తించారు. హెచ్ఎంటీ హిల్స్, సాయిచరణ్ కాలనీకి చెందిన బాధితులు వాంతులు(Vomiting), విరేచనాల(Diarrhea)తో ఆసుపత్రుల్లో చేరారు. ప్రస్తుతం 31 మంది నిమ్స్(NIMS)లో, ఇతరులు గాంధీ ఆసుపత్రి(Gandhi Hospital)లో చికిత్స పొందుతున్నారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. తెలంగాణ వైద్యారోగ్యశాఖ(Telangana Health Department) మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఈరోజు ఆయన ఎక్సైజ్ శాఖ(Excise Department) మంత్రి జూపల్లి కృష్ణారావు బాధితులను పరామర్శించి, మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

ఐదు కల్లు కాంపౌండ్లను సీజ్
అలాగే ఘటనకు కారణమైన ఐదు కల్లు కాంపౌండ్(Kallu Compound)లను సీజ్ చేసినట్లు తెలిపారు. బాలానగర్, కూకట్పల్లి, KPHB పోలీస్ స్టేషన్లలో 8 కేసులు నమోదయ్యాయి. నగేష్, శ్రీనివాస్, కుమార్, రమేశ్‌తో సహా ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కల్తీ కల్లు నమూనాలను ల్యాబ్(Lab)కు పంపి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎంపీ ఈటల రాజేందర్ మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం(Compensation) అందించాలన్నారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.







