Bhadrakaali: విజయ్ ఆంటోని ‘భధ్రకాళి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..

విజయ్ ఆంటోని(Vijay Antony) 25వ చిత్రం ‘భద్రకాళి(Bhadrakaali)’ సినిమా రిలీజ్ డేట్(Release Date) ఖరారైంది. ఈ చిత్రం సెప్టెబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అరుణ్ ప్రభు(Director Arun Prabhu) దర్శకత్వంలో విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ , మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లపై నిర్మితమవుతున్న ఈ సినిమా, ఇప్పటికే తన ఫస్ట్‌లుక్ పోస్టర్(Firstlook Poster), టీజర్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని ఒక ఉన్నతాధికారి, గ్యాంగ్‌స్టర్, ఫ్యామిలీమ్యాన్‌గా విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. రూ.190 కోట్ల రూపాయల స్కామ్‌ చుట్టూ తిరిగే కథాంశం, ఉత్కంఠభరితమైన కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.

Bhadrakali Teaser: Intense & Gripping Tale - News - IndiaGlitz.com

రూ.190 కోట్ల చుట్టూ తిరికే స్కామ్ కథ

“ఏదోకక రోజు పిల్లి కూడా పులిగా మారుతుంది” అనే ట్యాగ్‌లైన్ సినిమా ఇంటెన్షన్‌ను తెలియజేస్తోంది. హరిని సుందరరాజన్(Harini Sundararajan), రియా జితు, తృప్తి రవీంద్ర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణ విలువలు, దృశ్యాలు అత్యుత్తమంగా ఉన్నాయని విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు. మ్యూజిక్, BGM కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. విజయ్ ఆంటోని యొక్క బహుముఖ నటన, అరుణ్ ప్రభు యొక్క దర్శకత్వ ప్రతిభ కలిసి ‘భద్రకాళి’ని ఒక గొప్ప యాక్షన్ డ్రామా(Action Drama)గా మలచనున్నాయి.

తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం, విజయ్ ఆంటోని అభిమానులకు ఒక విజువల్ ట్రీట్‌(Visual Treat)గా ఉండనుంది. సినిమా టీజర్‌లో చూపించిన యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్‌లు ప్రేక్షకులను థియేటర్‌లకు రప్పించే అవకాశం ఉంది. సెప్టెంబర్ 5న ‘భద్రకాళి’ సినిమా బాక్సాఫీస్(Box Office) వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *