Thammudu: ఓటీటీలోకి ‘తమ్ముడు’.. త్వరలోనే స్ట్రీమింగ్!

నితిన్ (Nitin) హీరోగా, శ్రీరామ్ వేణుb(Director Venu Sriram) దర్శకత్వంలో రూపొందిన ‘తమ్ముడు (Thammudu)’ సినిమా జూలై 4న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(SVC) బ్యానర్‌పై దిల్ రాజు(Dil Raju), శిరీష్(Sirish) నిర్మించిన ఈ చిత్రం యాక్షన్ మరియు ఎమోషనల్ డ్రామా(Emotional Drama)తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా OTTలోకి రాబోతోందన్న వార్త సినీ ప్రియులను ఉత్తేజపరుస్తోంది.

భారీ ధరకు డిజిటల్ రైట్స్‌

సినీ వర్గాల ప్రకారం, ‘తమ్ముడు’ డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్(Netflix)భారీ ధరకు దక్కించుకుంది. మొదట అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)ఈ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, కొన్ని కారణాల వల్ల నెట్‌ఫ్లిక్స్‌కు ఈ అవకాశం దక్కింది. ఈ నెలాఖరు వారంలో సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది, అయితే ఖచ్చితమైన తేదీపై మేకర్స్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

థియేటర్లలో మిశ్రమ స్పందన

ఈ సినిమాలో నితిన్‌తో పాటు లయ(Laya), సప్తమి గౌడ(Sapthami Gowda), వర్ష బొల్లమ్మ(Varsha Bollamma), సౌరభ్ సచ్‌దేవ్, శ్వాసిక విజయ్, హరితేజ(Hari Teja) తదితరులు కీలక పాత్రలు పోషించారు. బి. అజనీష్ లోక్‌నాథ్(Ajanish Loknath) సంగీతం అందించిన ఈ చిత్రం ఆర్చరీ క్రీడల చుట్టూ తిరిగే కథతో ఆకట్టుకుంటుంది. థియేటర్లలో మిశ్రమ స్పందన పొందినప్పటికీ, OTTలో ఈ సినిమాకు మంచి ఆదరణ లభించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. థియేట్రికల్ రన్ పూర్తయిన వెంటనే ఓటీటీలోకి వస్తున్న ఈ చిత్రం, నితిన్ అభిమానులకు ఇంటి వద్దనే సినిమా ఆనందాన్ని అందించనుంది. త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో ‘తమ్ముడు’ స్ట్రీమింగ్ డేట్‌(Thammudu Streaming Date)పై అధికారిక ప్రకటన రానుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *