సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth), నెల్సన్ దిలీప్‌కుమార్(Nelson Dilipkumar) కాంబినేషన్లో వచ్చిన ‘జైలర్’(Jailer) ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రజినీ కెరీర్‌కి మరో హైపాయింట్గా నిలిచిన ఈ సినిమా రూ.600 కోట్లకుపైగా వసూలు చేసి, విమర్శకుల నోళ్లు మూయించింది. గతంలో నెల్సన్ తెరకెక్కించిన ‘బీస్ట్’ ఘోర ఫ్లాప్ కావడంతో ఆయనపై నెగటివ్ కామెంట్లు వెల్లువెత్తాయి. అలాంటి సమయంలో రజినీకాంత్ ఈ డైరెక్టర్‌తో సినిమా చేయడాన్ని చూసి పలువురు విమర్శలు చేసినా, ‘జైలర్’ అంచనాల్ని తలకిందులు చేస్తూ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
ఇప్పుడు ‘జైలర్ 2’(Jailer2)పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే చిత్రబృందం కేరళలో ఓ షెడ్యూల్ పూర్తి చేయగా, ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుతోంది. ఫస్ట్ పార్ట్‌లో ప్రత్యేక పాత్రల్లో మెరిసిన మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్‌లు సీక్వెల్లోనూ కొనసాగుతున్నారు. తాజాగా మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ సెట్స్‌లో జాయిన్ అయ్యారు. ఈసారి ఆయన పాత్ర మరింత పవర్‌ఫుల్‌గా ఉంటుందని డైరెక్టర్ నెల్సన్ హింట్ ఇచ్చాడు. త్వరలోనే శివరాజ్‌కుమార్ కూడా షూటింగ్లో పాల్గొననున్నారు.
ఈ సీక్వెల్ లో నందమూరి బాలకృష్ణ(Balakrishna) అతిథి పాత్రలో నటించనున్నరనే టాక్ నడుస్తుంది. ఈ సినిమాలో బాలయ్య పాత్ర చిన్నదైనప్పటికీ, కథను మలుపు తిప్పే కీలక ఘట్టంగా ఉండనుందట. యాక్షన్‌తో కూడిన ఓ పవర్ఫుల్ ఎంట్రీ సన్నివేశంతో, ప్రేక్షకుల నుంచి వీరాభిమానులు దానికి తగిన రెస్పాన్స్ ఇస్తారని మేకర్స్ నమ్ముతున్నారు. ఇందులో బాలయ్య పోలీస్ గెటప్, డైలాగ్ డెలివరీ, ఎనర్జీ చూస్తే రియల్ మాస్ ఎలివేషన్ కలుగుతుందని అంటున్నారు. రజినీకాంత్–బాలయ్య కాంబినేషన్లో స్క్రీన్ పైన ఒకే ఫ్రేమ్ లో కనిపించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఇక టెక్నికల్ టీమ్ విషయానికొస్తే, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మరోసారి యాక్షన్ మ్యూజిక్‌తో ప్రేక్షకులను ఊపేస్తాడన్న నమ్మకముంది. మొదటి భాగానికి ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంత హైప్ తీసుకొచ్చిందో, ఇప్పుడు సీక్వెల్‌కి అది మరింత బలాన్నిస్తుందని అభిమానులు భావిస్తున్నారు.
ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, త్వరలోనే ఓ భారీ షెడ్యూల్ కోసం హైదరాబాదు, మైసూరు, ముంబైలో కూడా సన్నివేశాలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సీక్వెల్‌ను మలుస్తుండటంతో, ‘జైలర్ 2’ పాన్ ఇండియా స్థాయిలో మరొక బ్లాక్‌బస్టర్ అవుతుందన్న అంచనాలు బలపడుతున్నాయి.






