వరుసగా ఫాంటసీ డ్రామాలు, భారీ యాక్షన్ థ్రిల్లర్స్‌లో నటిస్తున్న ప్రభాస్(Prabhas), ఈసారి విభిన్నంగా కనిపించబోతున్నాడు. మారుతి(Maruthi Director) దర్శకత్వంలో రూపొందుతున్న ‘ ది రాజా సాబ్’(The Raja Saab) చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొన్ని సినిమాల్లో లార్జర్-దెన్-లైఫ్ పాత్రలే చేస్తున్న ప్రభాస్, ఈసారి మాత్రం పూర్తిగా డార్లింగ్ మూడ్‌లోకి మారనున్నాడు.

‘బాహుబలి’(Bahubali) తర్వాత ప్రభాస్ చేసిన సాహో(Saahu), రాధే శ్యామ్(Raade Syam), ఆదిపురుష్(Aadhipurush), సలార్(Salaar), కల్కి 2898 AD లాంటి చిత్రాలన్నీ భారీ బడ్జెట్, విజువల్ గ్రాండియర్‌తో రూపొందాయి. ఇందులో ప్రేమకథ అయిన రాధే శ్యామ్ కూడా విఎఫ్ఎక్స్భారీ చిత్రంగానే నిలిచింది. అలాంటి బ్యాక్‌డ్రాప్‌లో మారుతితో చేస్తున్న ‘రాజా సాబ్’ హార్రర్ కామెడీతో పాటు వినోదం అదిరిపోయే డాన్సులు కూడా హైలెట్ కానున్నాయి.

తక్కువ బడ్జెట్ మూవీలా కనిపించినా, ఈ చిత్రానికి రూ.200 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. “మంచి రోజులొచ్చాయి” వంటి ప్లాప్ తర్వాత కూడా మారుతిపై నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఇప్పటికే విడుదలైన టీజర్లో ప్రభాస్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పైగా ఈ సినిమాతో ప్రభాస్ మళ్లీ డాన్సులకి తిరిగొస్తున్నాడు. చాలా కాలంగా మిస్సయ్యిన అతని రొమాంటిక్ యాంగిల్ ఈ సినిమాలో హైలైట్ కానుంది.

మాళవిక మోహనన్(Malavika Mohanan), నిధి అగర్వాల్(Nidhi Agarwal), రిద్ధి కుమార్(Riddhi Kumar) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం 2025 డిసెంబర్ 5న విడుదల కానుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్, హార్రర్ కామెడీ జానర్‌తో ప్రేక్షకులను అలరించేందుకు ‘రాజా సాబ్’ సిద్ధమవుతోంది. అభిమానులు కోరుకున్న పాత డార్లింగ్ ప్రభాస్‌ను మళ్లీ తెరపై చూపించేందుకు మారుతి శ్రమిస్తున్నాడు.






