
ఒడిశా(Odisha)లో దారుణం జరిగింది. ప్రేమించి పెళ్లి(Love Marriage) చేసుకున్నందుకు ఓ జంటపై గ్రామస్థులు అమానుషంగా ప్రవర్తించారు. వారిని కాడెద్దులుగా నాగలికి కట్టి పొలం దున్నించారు. కంజామఝీరా గ్రామానికి చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారి ప్రేమను ఇంట్లో వారు అంగీకరించినా.. ఆ ఊరి సంప్రదాయం, కట్టుబాట్ల వల్ల ఊరిపెద్దలు అంగీకరించలేదు. అత్త కూతురిని పెళ్లి చేసుకోగా.. ఆ గ్రామంలో అత్త కూతురిని పెళ్లి చేసుకోవడం నిషేధం. ఇదే గ్రామస్థుల కోపానికి కారణమైంది. ఆ జంటను గ్రామస్థుల సమక్షంలో నిలబెట్టి, తీవ్రంగా అవమానించారు. అంతటితో ఆగకుండా అత్యంత దారుణంగా, వారిద్దరినీ నాగలికి కట్టి పొలం దున్నమని ఆదేశించారు. వారిని కర్రలతో కొడుతూ పొలం దున్నించారు.
तालिबानी होता समाज।
ग्रामीणों ने प्रेमी जोड़े को बांस और लकड़ी से बने हल में बांध दिया। दोनों ने गांव की कथित परंपराओं के खिलाफ जाकर शादी कर ली थी।
यह अमानवीयता ओडिशा की है।#Odisha pic.twitter.com/8c1N8TG6Ll
— Mukesh Mathur (@mukesh1275) July 11, 2025
పెద్దల మాటకు ఎదురు చెప్పలేక..
ఆ తర్వాత ఆలయంలో శుద్ధి కర్మలు చేయించారు. ఈ సంఘటనను కొందరు చూసి బాధపడినా, పెద్దల మాటకు ఎదురు చెప్పలేక మౌనంగా ఉండిపోయారు. మరికొందరు దీన్ని ‘తప్పు చేసిన వారికి సరైన శిక్ష’గా భావించారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు(Police) రంగంలోకి దిగారు. బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి అమానవీయ చర్యలు సమాజంలో జరగకుండా చూడాలని, ప్రేమించుకున్న జంటలకు రక్షణ కల్పించాలని సామాజిక కార్యకర్తలు, మానవ హక్కుల సంఘాలు(Human rights groups) డిమాండ్ చేశాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్గా మారింది.