Super Man: ఆ ముద్దు సీన్​ ఎందుకు తొలగించారు.. సెన్సార్​ బోర్డ్​పై నటి ఫైర్​

డేవిడ్‌ కొరెన్స్‌వెట్‌, రెచెల్‌ లీడ్​ రోల్స్​లో వచ్చిన మూవీ ‘సూపర్‌ మ్యాన్‌’ (Super Man). శుక్రవారం విడుదలై మంచి టాక్​ తెచ్చుకుంది. అయితే ఈ మూవీ ఇండియన్‌ వెర్షన్​లో కొన్ని సన్నివేశాల్లో హీరో వాడే పదాలతోపాటు 33 సెకన్ల ముద్దు సీన్​ను తొలగించాలని సెన్సార్‌ ఆదేశించింది. దీంతో మూవీ బృందం ఆ సీన్లను తొలగించింది. అయితే ఇది వివాదానికి దారి తీసింది. ముద్దు సీన్​ తొలగింపుపై బాలీవుడ్‌ నటి శ్రేయా ధన్వంతరి (Shreya Dhanwanthary) ఫైర్​ అయ్యారు. 33 సెకన్ల ముద్దు సీన్​ను ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. ఇదొక అర్థం పర్థం లేని చర్య అని వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యల వల్ల జనాల్లో సినిమాలు చూడాలనే ఆసక్తి పోతోందని పేర్కొన్నారు.

I bagged Why Cheat India after auditioning for three months”- Shreya  Dhanwanthary - Planet Bollywood

వాళ్ల ఉద్దేశమేంటో నాకు అర్థంకావడం లేదు

‘సూపర్‌మ్యాన్‌లో 33 సెకన్ల సన్నివేశాన్ని సెన్సార్‌ తొలగించింది. ఇదేం చర్య? మనం థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడాలని సెన్సార్‌ వాళ్లు కోరుకుంటారు. పైరసీలను ప్రోత్సహించవద్దని చెప్తుంటారు. కానీ వాళ్లు మాత్రం ఇలాంటి పనులు చేస్తారు. వాళ్ల ఉద్దేశమేంటో నాకు అర్థంకావడం లేదు. ఇలాంటి చర్యలతో థియేటర్‌ అనుభూతిని దారుణంగా దెబ్బతీస్తున్నారెందుకు? మా డబ్బు, సమయంతో మేము ఏం చూడాలనుకుంటున్నామో మమ్మల్నే నిర్ణయించుకోనివ్వండి. సినిమా చూడటానికి థియేటర్‌ ఉత్తమ మార్గం. ప్రేక్షకులను చిన్న పిల్లల్లా భావించి.. థియేటర్‌ అనుభూతిని పూర్తిగా ఆస్వాదించకుండా చేస్తున్నారు’ అని ఆమె ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్‌ పెట్టారు.

తెలుగులోనే శ్రేయా ఎంట్రీ

బాలీవుడ్‌లో వచ్చిన పలు చిత్రాల్లో శ్రేయా ధన్వంతరి నటించారు. ‘ఫ్యామిలీ మ్యాన్‌’, ‘చుప్‌’, ‘స్కామ్‌ 1992’ వంటి ప్రాజెక్ట్‌లు ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. అయితే శ్రేయా ధన్వంతరి తెలుగులోనే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం.  నాగ చైనత్య ఫస్ట్​ మూవీ ‘జోష్‌’తో కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత ‘స్నేహ గీతం’ సినిమాలో హీరోయిన్​గా నటించింది. ఆ తర్వాత బాలీవుడ్​లోకి వెళ్లింది. త్వరలో విడుదల కానున్న ‘ఫ్యామిలీ మ్యాన్‌ 3’లోనూ ఆమె కీలక పాత్ర పోషించింది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *