లార్డ్స్(Lord’s) వేదికగా ఇంగ్లండ్(England)తో జరుగుతున్న మూడో టెస్టు(Third Test) రసవత్తరంగా సాగుతోంది. తొలి మూడు రోజులు రెండు జట్లు తమ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకే ఆలౌట్ అయ్యాయి. దీంతో ఈ టెస్టు డ్రాగా ముగుస్తుందని అంతా భావించారు. అయితే నాలుగో రోజు ఏకంగా 14 వికెట్లు కూలడంతో మ్యాచ్ అనూహ్యంగా ఆసక్తిని పెంచేసింది. తొలుత రెండో ఇన్నింగ్స్‌లో భారత(India) బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లండ్ 192 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో క్రాలీ 22, డకెట్ 12, రూట్ 40, బ్రూక్ 23, స్టోక్స్ 33 రన్స్ చేశారు. మిగతా వారంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు కూల్చాడు. బుమ్రా, సిరాజ్ చెరో రెండు వికెట్లు తీశారు. నితీశ్, ఆకాశ్ దీప్ చెరో వికెట్ పడగొట్టారు.

ఆ నలుగురిపైనే విజయావకాశాలు
అనంతరం 193 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా(Team India)కు ఇంగ్లండ్ బౌలర్లు చుక్కలు చూపించారు. జట్టు స్కోరు 5 పరుగుల వద్ద జైస్వాల్ డకౌట్ కాగా.. కాసేపటికే కరుణ్ నాయర్ (14) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వెంటనే కెప్టెన్ గిల్(6)ను కార్స్ అద్భుత బంతితో పెవిలియన్ చేర్చాడు. ఇక నాలుగో రోజు ఆటలో చివరి బంతికి ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్(Stokes) ఆకాశ్ దీప్‌ను క్లీన్ బౌల్డ్ చేయడంతో భారత్ 58 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో రాహుల్ (33*) ఉండగా.. చివరి రోజు రాహుల్(Rahul)తోపాటు పంత్, జడేజా, సుందర్ ఏ మేరకు బ్యాటింగ్ చేస్తారనే దానిపైనే భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
Mr. Dependable and Mr. Aggresive can bring victory to IND. It’s Carse who did huge damage to India, getting Karun Nair and Captain Subhman for LBW. India 54/4 at the end of DAY4. 135 needed, still chasable score, Thx to Washy for his 4 clean bowled wickets#INDvsENG #LordsTest pic.twitter.com/qHyCk54p32
— Warrior YSRCP (@Vamsee007) July 13, 2025






