Rajamouli: ఏంటి బ్రో.. సమయం, సందర్భం ఉండక్కర్లే.. అభిమానిపై రాజమౌళి ఫైర్

ఈ మధ్య చాలా మందికి స్మార్ట్ ఫోన్(Mobile) చేతిలో ఉండే సరికి ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో తెలియడం లేదు. ముఖ్యంగా సెలబ్రిటీ (Celebrities)ల విషయంలో ఈ మధ్య అభిమానులు ప్రవర్తిస్తున్న తీరు వారికి చిరాకు తెప్పిస్తున్న విషయం తెలిసిందే. వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియకుండా వారితో సెల్పీ(Selfies)ల కోసం ఎగబడుతూ వారి ఆగ్రహానికి గురవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఓ అభిమానిపై దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి(SS Rajamouli) ఆగ్రహం తెప్పించింది. ఇంతకీ ఏమైందంటే.. నిన్న నవరస నటుడు, నట కిరీటి కోట శ్రీనివాసరావు(Kota Srinivasa Rao) మరణించిన విషయం తెలిసిందే.

అసహనానికి గురైన రాజమౌళి

ఈ సందర్భంగా ఆయన తెలుగు పరిశ్రమ(Telugu industry)కు ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ టాలీవుడ్(Tollywood) ప్రముఖులంతా నివాళులర్పించేందుకు జూబ్లీహిల్స్‌లోని నివాసానికి వచ్చారు. ఈ క్రమంలోనే రాజమౌళి తన సతీమణితో కలిసి కోట శ్రీనివాసరావుకు నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి వెళ్తుండగా ఓ అభిమాని(Fan) చేసిన పని రాజమౌళికి కోపం తెప్పించేలా చేసింది. తన కారు వైపు వెళ్తున్న డైరెక్టర్‌ను ఓ అభిమాని సెల్ఫీ(Selfie) కోసం వెంటపడ్డారు. ఫొటో తీసుకునేందుకు ఆయన కారు వరకు వెళ్లాడు. దీంతో అసహనానికి గురైన రాజమౌళి ఏంటిది? అంటూ అతన్ని తోసేశాడు. ఇది చూసిన నెటిజన్స్‌ అభిమానిపై మండిపడుతున్నారు. వచ్చిన సందర్భం ఏంటో తెలుసుకోకుండా సెల్ఫీ కోసం ఎగబడడం ఏంటని అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *