శృతి హాసన్(Shruti Haasan) సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. కమల్ హాసన్(Kamal Haasan) కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన.. ఆమె తన టాలెంట్‌తోనే గుర్తింపు తెచ్చుకుంది. సింగర్, మ్యూజిక్ కంపోజర్‌గా కెరీర్ ను ప్రారంభించిన, అనగనగా ఒక ధీరుడు సినిమాతో తెలుగు తెరపైకి వచ్చింది. మొదటి సినిమాతోనే హిట్ ను అందుకుంది. తర్వాత గబ్బర్ సింగ్, శ్రీమంతుడు, వేదాళం, పవన్ కళ్యాణ్ తో నటించిన సినిమాలు ఆమెను టాప్ లీగ్‌లో నిలబెట్టాయి.
కెరీర్ పరంగా ఎదుగుతూ ఉన్న సమయంలోనే, ప్రేమలో పడింది శృతి. లండన్‌కు చెందిన యాక్టర్ మైఖేల్ కోర్సలే(michael corsale)తో లవ్ స్టోరీ మొదలైంది. ఈ జంట ఓ దశలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా వారు బ్రేకప్ అయ్యారు. ఈ బ్రేకప్ శృతిపై తీవ్ర ప్రభావం చూపింది. సినిమా జీవితానికి బ్రేక్ ఇచ్చి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో విజువల్ ఆర్టిస్ట్ శంతను హజారికా ఆమెకు డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత శంతను హజారికా(Santanu Hazarika)తో ప్రేమలో పడటం, చివరికి అది కూడా ముగియడం ఇవన్నీ ఆమె మనసును తీవ్రంగా ప్రభావితం చేశాయి.
ప్రస్తుతం శృతి మళ్లీ కెరీర్‌పైనే దృష్టి సారిస్తోంది. తాజాగా కూలీ(Coolie) సినిమాలో నటిస్తోంది. ఓ ఇంటర్వ్యూలో పెళ్లిపై స్పందిస్తూ.. “పెళ్లంటే భయమేస్తోంది. బాధ్యతలను ఓ చిన్న కాగితంపై రాయడం నాకు నచ్చదు. ఒంటరిగా ఉండటం నాకు కొత్త కాదు. సింగిల్ మదర్‌గా ఉండాలనుకోవడం లేదు. సింగిల్ మదర్‌గా జీవించడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఎందుకంటే నా జీవితంలో ఒకసారి పెళ్లి వరకు వెళ్లి వచ్చాను. పెళ్లి చేసుకోవాలని నిజంగా అనుకున్నాను. కానీ ఆ సంబంధం ముందుకు సాగలేదు, ముడిపడలేదు. పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మద్య ఉండే బంధం మాత్రమే కాదు, అది రెండు జీవితాలపై ఆధారపడి ఉంటుంది. నిజానికి, జీవితంలో చాలా విషయాలు ఒంటరిగా ఉన్నప్పుడే నేర్చుకున్నాను,” అని శృతి హాసన్ చెప్పుకొచ్చింది.
View this post on Instagram






