పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కమిటై ఉన్న సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా.. ఓజీ మూవీ షూటింగ్ జరుగుతోంది.
ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) షూటింగ్ పనులను వేగంగా పూర్తి చేయడానికి సిద్ధమవుతున్నారు. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ (Harish Shankar)కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ నుంచి లీకైన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పవన్ కల్యాణ్, శ్రీలీల(Sreeleela) లుక్ అదిరింది. ఇందులో పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్‌లో సన్‌గ్లాసులు, టీషర్ట్, జీన్స్ ధరించి స్టైలిష్ లుక్ లో కనిపించారు. ఈ సినిమా విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ వచ్చే ఏడాది వేసవి సీజన్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లుగా తెలుస్తోంది.
#UstaadBhagatSingh pic.twitter.com/xpGI7UG9px
— raghava Rwdy (@rooohittu) July 14, 2025
ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, సాక్షి వైద్య, అశుతోష్ రానా, గౌతమి, నాగ మహేష్, టెంపర్ వంశీ, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ వంటి నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం టాలీవుడ్ టాప్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.






