నేటి పోటీ ప్రపంచంలో ఆర్థిక భద్రత కోసం ఎక్కువ మంది ఉద్యోగం(Job) కాకుండా మరో ఆదాయన్నీ వెతుకుతున్నారు. ఖాళీ సమయాన్ని ఉపయోగించుకొని హాబీలను, నైపుణ్యాలను ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారు. ఇందు కోసం అనేక మంది సైడ్ ఇన్‌కమ్( Side Income ) అవకాశాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2025లో అత్యుత్తమంగా భావించబడుతున్న కొన్ని సైడ్ హస్టల్స్ (side hustles) గురించి తెలుసుకుందాం.
ఆన్‌లైన్ ట్యూటరింగ్:
మీకు ఒక సబ్జెక్టుపై పట్టు ఉంటే ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు బోధిస్తూ ఆదాయం పొందవచ్చు. చెగ్ (Chegg), ప్రెప్లీ (Preply), టాపర్ (Toppr) వంటి వేదికలు ఆన్‌లైన్ ట్యూటర్స్‌కు అవకాశాలు కల్పిస్తున్నాయి.
వర్చువల్ అసిస్టెంట్:
కంపెనీలకు ఈమెయిల్ మేనేజ్‌మెంట్, షెడ్యూలింగ్, సోషల్ మీడియా హ్యాండ్లింగ్ వంటి సహాయ పనుల్లో భాగమై ఆదాయం పొందవచ్చు. ఫైవర్ (Fiverr), అప్‌వర్క్ (Upwork) వంటి ప్లాట్‌ఫార్ములు వర్చువల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు మద్దతిస్తాయి.
వెబ్ టెస్టింగ్:
కంపెనీల వెబ్‌సైట్స్ వినియోగదారుల అనుభవాన్ని పరీక్షించే పని వెబ్ టెస్టర్‌దే. యాప్‌సియారా (AppSierra), బగ్‌రాపర్ట్స్ (BugRapports) వంటివి అవకాశాలను కల్పిస్తున్నాయి.
డెలివరీ పార్టనర్:
జోమాటో, స్విగ్గీ, ఊబర్ ఈట్స్, జెప్టో వంటి సంస్థల్లో డెలివరీ పార్టనర్‌గా పని చేసి సులభంగా ఆదాయం పొందవచ్చు.
డాగ్ వాకింగ్:
పెంపుడు జంతువులకు వాకింగ్ సేవల కోసం డిమాండ్ పెరుగుతోంది. డాగ్ లవర్స్‌కి ఇది సరైన ఆదాయ మార్గం.
ఫోకస్ గ్రూప్ పార్టిసిపేషన్:
కంపెనీలు తమ ఉత్పత్తులపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఫోకస్ గ్రూపులు ఏర్పాటు చేస్తాయి. వీటిలో పాల్గొనడం ద్వారా కూడా ఆదాయం పొందవచ్చు.
పర్సనల్ అసిస్టెంట్:
బిజీ ప్రొఫెషనల్స్‌కు షాపింగ్, షెడ్యూలింగ్ వంటి వ్యక్తిగత పనుల్లో సహాయం చేయడం ద్వారా ఆదాయం పొందవచ్చు.
బేబీసిట్టింగ్ & హౌస్ క్లీన్ Jobs:
కేర్ డాట్ కామ్, అర్బన్ సిట్టర్ వేదికల ద్వారా బేబీసిట్టర్ ఉద్యోగాలు పొందొచ్చు. అలాగే నో బ్రోకర్, అర్బన్ కంపెనీ వేదికల ద్వారా హౌస్ క్లీనింగ్ సేవలకు డిమాండ్ ఉంది.






