టీమ్ఇండియా(Team India) ప్లేయర్, వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant) ఇంగ్లండ్ టూర్(England Tour)లో అదరగొడుతున్నాడు. లీడ్స్(Leads)లో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు (134, 118) పంత్.. ఆ తర్వాతి నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 25, 65, 74, 9 రన్స్ చేశాడు. ఓవరాల్‌గా ఇప్పటి వరకూ 425 రన్స్‌తో సిరీస్‌లో సెకండ్ లీడింగ్ స్కోరర్‌గా ఉన్నాడు. భారత జట్టుకు వైస్ కెప్టెన్(Vice Captain)గా ఉన్న పంత్ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఆడటం ఖాయం. జులై 23 నుంచి మాంచెస్టర్(Manchester)లో మొదలుకానున్న నాలుగో టెస్టులో పంత్ 58 ఏళ్ల నాటి ఓ రికార్డును బ్రేక్ చేసే అవకాశముంది. ఇంతకీ అందేటో ఓలుక్ వేద్దామా..
రిషభ్ మరో 101 పరుగులు చేస్తే..
ఒక టెస్టు సిరీస్‌లో హయ్యెస్ట్ రన్స్ (526) చేసిన భారత వికెట్‌కీపర్(Wicket-Keeper)గా పంత్ నిలవనున్నాడు. ఇందుకు అతడు మరో 101 పరుగులు చేస్తే చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ రికార్డు కుందరన్ పేరిట ఉంది. 1964లో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్ కోసం ఇండియాకు వచ్చింది. అప్పుడు కుందరన్ 10 ఇన్నింగ్స్‌ల్లో 525 రన్స్ చేశారు. ఇందులో 2 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. అంతేకాదు ఒక టెస్టు సిరీస్‌లో 500కుపైగా పరుగులు చేసిన ఏకైక భారత వికెట్‌కీపర్ కూడా కుందరనే. ఓవరాల్‌గా చూస్తే డెనిస్ లిండ్సే (South Africa) అగ్రస్థానంలో ఉన్నాడు. లిండ్సే 1966-67 మధ్య ఆస్ట్రేలియా(Australia)పై ఐదు మ్యాచ్‌ల్లో 606 పరుగులు సాధించాడు. పంత్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే లిండ్సే రికార్డునూ బ్రేక్ చేయడం ఖాయం.

టెస్టుల్లో పంత్ అద్భుత రికార్డులివే
రిషభ్ పంత్ టెస్టు క్రికెట్(Test Cricket)లో అనేక అద్భుత రికార్డులు సాధించాడు. 2018లో టెస్టు అరంగేట్రం చేసిన పంత్, 2025 వరకు 44 టెస్టు మ్యాచ్‌లు ఆడి, 77 ఇన్నింగ్స్‌లలో 3200 పరుగులు చేశాడు, సగటు 44.44, స్ట్రయిక్ రేట్ 74.02గా ఉంది. అతని ఖాతాలో 8 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే పంత్ భారత వికెట్ కీపర్‌గా అత్యధికంగా 8 టెస్టు సెంచరీలు, MS ధోని (6) రికార్డును అధిగమించాడు. ఇందులో 6 సెంచరీలు విదేశీ గడ్డపైనే కావడం గమనార్హం. అలాగే ఒకే టెస్టులో రెండు సెంచరీలు (134 & 118) చేసిన ఆసియా తొలి ప్లేయర్‌గా, ఓవరాల్‌గా రెండో వికెట్ కీపర్‌గా నిలిచాడు. కాగా మూడో టెస్టులో గాయపడిన పంత్ నాలుగో టెస్టులో ఆడేది లేనిది మ్యాచుకు ముందే తెలియనుంది.
Ravi Shastri believes Rishabh Pant should sit out of the fourth Test unless he’s fully fit! 🚫
Do you agree with him? 🧐#ENGvIND #RishabhPant #TestCricket #Sportskeeda pic.twitter.com/1S58nrHgiQ
— Sportskeeda (@Sportskeeda) July 18, 2025






