బాలీవుడ్(Bollywood) సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్(Akshay Kumar) స్టంట్ కళాకారుల భద్రత కోసం తీసుకున్న చొరవతో ఇండస్ట్రీలో ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇటీవల తమిళ చిత్రం ‘వెట్టువం(Vettuvam)’ సెట్లో స్టంట్‌మ్యాన్ ఎస్.ఎం. రాజు(MS Raju) దురదృష్టవశాత్తు మరణించిన ఘటన తర్వాత అక్షయ్ కుమార్ 700 మంది స్టంట్ ఆర్టిస్టుల(Stunt Artists)కు ఆరోగ్య, ప్రమాద బీమా(Health and accident insurance) సౌకర్యాన్ని అందించారు. ఈ నిర్ణయం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో స్టంట్ ఆర్టిస్టుల భద్రతపై దృష్టి సారించేలా చేసింది.
2017 నుంచి స్టంట్ కళాకారులకు బీమా సౌకర్యం
స్టంట్ ఆర్టిస్టులు సినిమాల్లో హై-రిస్క్ యాక్షన్ సన్నివేశా(High-risk action Scenes)లను ప్రదర్శిస్తూ, తరచూ తగిన భద్రతా పరికరాలు లేదా వైద్య సహాయం లేకుండా పనిచేస్తారు. ఒక్క చిన్న గాయం కూడా వారి ఆర్థిక స్థితిని దెబ్బతీస్తుంది, ఎందుకంటే చాలా మందికి బీమా లేదా ఉద్యోగ భద్రత(Job security) ఉండదు. ఈ సమస్యను గుర్తించిన అక్షయ్, 2017 నుంచి స్టంట్ కళాకారులకు బీమా(Insurance) సౌకర్యాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమం కింద, గాయాలు లేదా ప్రమాదాల సందర్భంలో రూ. 5 నుంచి రూ.5.5 లక్షల వరకు క్యాష్‌లెస్ వైద్య చికిత్స అందుతుంది. మరణం సంభవించినట్లయితే, నామినీకి రూ. 20-25 లక్షల వరకు అందేలా చర్యలు చేపట్టారని స్టంట్ కోఆర్డినేటర్ విక్రమ్ సింగ్ దహియా(Vikram Singh Dahiya) తెలిపారు.
View this post on Instagram
ఇండస్ట్రీలో సామాజిక బాధ్యతకు అక్షయ్ ఆదర్శంగా నిలిచారు..
‘‘అక్షయ్ సహకారంతో 650-700 మంది స్టంట్ ఆర్టిస్టులు బీమా పరిధిలోకి వచ్చారు. ఈ పథకం స్టంట్ ఆర్టిస్టులకు ఆర్థిక భద్రతను అందించడమే కాక, వారి కృషిని గుర్తించి, విలువైన భావన కల్పిస్తోంది. అయితే, ఈ చొరవ వ్యక్తిగత సహకారంపై ఆధారపడటం కంటే, చలనచిత్ర పరిశ్రమలో భద్రతా చర్యలు సంస్థాగతంగా అమలు కావాలి. అక్షయ్ కుమార్ ఈ చొరవ ద్వారా స్టంట్ ఆర్టిస్టుల జీవితాల్లో మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తూ, సినీ పరిశ్రమలో సామాజిక బాధ్యతకు ఆదర్శంగా నిలిచారు. ఆయన స్ఫూర్తితో ఇతర సినీ నటులు కూడా ఇలాంటి చొరవలు చేపట్టేలా ప్రేరేపిస్తోంది’’ అని విక్రమ్ సింగ్ తెలిపారు.






