
తెలంగాణ(Telangana)లో ఉద్యోగంపై ఆశలు పెట్టుకున్న నిరుద్యోగుల(Unemployed Youth )కు మంచి అవకాశం వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే 60,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిన ప్రభుత్వం, త్వరలో మరో లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్ల(Notifications)ను విడుదల చేయనుంది. ఇందులో భాగంగా నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ సదుపాయాన్ని కూడా అందించనుంది.
బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో TGPSC, SSC, RRB, బ్యాంకింగ్ తదితర పోటీ పరీక్షల కోసం ఉచిత కోచింగ్( Free Coaching) కార్యక్రమం నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 11వ తేదీలోపు https://tgbcstudycircle.cgg.gov.in/FirstPage.do వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక జరగనుంది. ఎంపికైన వారికి నెలకు రూ.1,000 చొప్పున స్టైఫండ్(Monthly Stipend)ను కూడా ఇవ్వనున్నారు.
ఈ కోచింగ్ మొత్తం 5 నెలలపాటు కొనసాగుతుంది. ఇందులో టీజీపీఎస్సీ(TGPSC), ఎస్ఎస్‌సీ(SSC), ఆర్ఆర్‌బీ(RRB), బ్యాంకింగ్(Banking) వంటి ముఖ్యమైన పోటీ పరీక్షలపై స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. లక్ష్యంగా పెట్టుకున్న ఉద్యోగాలను సాధించేందుకు ఇది అభ్యర్థులకు మంచి అవకాశం కానుంది.
ఇటీవల రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, విద్యుత్, విద్య, ఆర్టీసీ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనలతో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల్లో ఆశలు పుట్టుకొచ్చాయి.