తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ (Fish Venkat) శుక్రవారం (జులై 18) రాత్రి కన్నుమూశారు. 53 ఏళ్ల ఆయన అసలు పేరు మంగిలంపల్లి వెంకటేశ్. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం(serious illness)తో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని RBM ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రెండు కిడ్నీలు పాడవడం(Kidney failure), డయాబెటిస్, రక్తపోటు సమస్యలతో ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు తెలిపారు. కిడ్నీ మార్పిడి అవసరమని వైద్యులు సూచించినప్పటికీ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా సకాలంలో చికిత్స అందలేదని సమాచారం.
ముషీరాబాద్‌లో చేపల వ్యాపారం చేస్తూ ఫేమస్
కాగా ఫిష్ వెంకట్, హైదరాబాద్‌లో పుట్టి పెరిగి, ముషీరాబాద్‌లో చేపల వ్యాపారం(Fish Business) చేస్తూ ‘ఫిష్’ అనే మారుపేరు సంపాదించారు. NTR నటించిన ‘ఆది(Aadi)’ సినిమాతో 2001లో వెండితెరకు పరిచయమై, ‘తొడగొట్టు చిన్నా’ డైలాగ్‌తో పాపులర్ అయ్యారు. గబ్బర్ సింగ్(Gabbar Singh), మిరపకాయ్, దిల్, అదుర్స్ వంటి వందకు పైగా చిత్రాల్లో కామెడీ, విలన్ పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. తెలంగాణ యాస, విలక్షణ నటనతో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు.
తెలంగాణ ప్రభుత్వం, సినీ ప్రముఖులు అండగా నిలిచినా..
ఆయన అనారోగ్య విషయం తెలిసి, పవన్ కళ్యాణ్(Pawan Kalyan), విశ్వక్ సేన్, రామ్ చరణ్, చిరంజీవి(Chiranjeevi) వంటి సినీ ప్రముఖులు ఆర్థిక సాయం, మద్దతుగా అందించారు. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయనకు అండగా ఉంటామని భరోసానిచ్చింది. అయినప్పటికీ, ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆయన కోలుకోలేకపోయారు. ఫిష్ వెంకట్ మృతి తెలుగు సినీ పరిశ్రమలో విషాదాన్ని నింపింది. అభిమానులు, సహనటులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన కుటుంబానికి ఈ కష్ట సమయంలో దాతలు, సినీ ప్రముఖులు మద్దతు అందించాలని కోరుతున్నారు.
నటుడు ఫిష్ వెంకట్ మృతి
ఓం శాంతి 🙏 pic.twitter.com/NJTzRqwXiv— Kakinada Talkies (@Kkdtalkies) July 18, 2025






