ఇంగ్లండ్(England) గడ్డపై భారత మహిళలు అదరగొడుతున్నారు. ఇప్పటికే టీ20 సిరీస్‌ను పట్టేసిన టీమ్ఇండియా(Team India).. అదే జట్టుతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్(ODI Series)లోనూ శుభారంభం చేసింది. ఈ క్రమంలో నేడు మరో కీలక పోరుకు సిద్ధమైంది. లండన్(London)లోని ఐకానిక్ లార్డ్స్(Lord’s) క్రికెట్ గ్రౌండ్లో శనివారం ఇరుజట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. కాగా లార్డ్స్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. అయితే ఉదయం పేస్ బౌలర్లకు కొంత సహకరిస్తుంది. స్పిన్నర్లు మధ్య ఓవర్లలో కీలక పాత్ర పోషిస్తారు. 250-280 పరుగులు చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువ. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్, సోనీ లివ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.
![]()
బ్యాటింగ్, బౌలింగ్‌లో బలంగా ఉన్నా..
కాగా భారత్ తమ బ్యాటింగ్ లైనప్‌లో స్మృతి మంధాన(Smriti Mandhana), ప్రతికా రావల్, హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kour) వంటి ఆటగాళ్లతో బలంగా ఉంది. అటు బౌలింగ్‌లోనూ దీప్తిశర్మ, అరుంధతిరెడ్డి, రాధా యాదవ్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. అయితే ఫీల్డింగ్‌లో మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఇంగ్లండ్ జట్టు నాట్ స్కివర్-బ్రంట్(Nat Sciver-Brunt) నాయకత్వంలో సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ బెల్ వంటి బౌలర్లతో పటిష్ఠంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకోగా.. తప్పక నెగ్గాలని ఇంగ్లండ్ భావిస్తోంది.

1-0 ఆధిక్యంలో హర్మన్ సేన
అంతకుముందు సౌతాంప్టన్(Southampton)లో జరిగిన తొలి వన్డేలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో ఉంది. దీప్తి శర్మ (62* రన్స్) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకోగా.. జెమీమా రోడ్రిగ్స్ (48 రన్స్)తో కలిసి 90 పరుగుల భాగస్వామ్యం భారత్ విజయంలో కీలకంగా నిలిచారు. ఇక ఇంగ్లండ్ తరఫున సోఫియా డంక్లీ (83 రన్స్), ఎలిస్ డేవిడ్సన్-రిచర్డ్స్ (53 రన్స్) రాణించినప్పటికీ, భారత బౌలర్లు స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్లు ఆకట్టుకున్నారు.
India are aiming for an unassailable 2-0 lead against England in their ongoing bilateral ODI series after having clinched the first match by four wickets.#indwvengw https://t.co/ZmKNVXaYZZ
— News18 CricketNext (@cricketnext) July 18, 2025






