Jr NTR రెమ్యూనరేషన్ లేకుండా నటించిన ఏకైక చిత్రం ఇదే! ఫాన్స్ ఎప్పటికి మర్చిపోలేరు!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎంత హై రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నారో అందరికీ తెలిసిందే. ఒక్కో సినిమా కోసం కోట్లాది రూపాయల పారితోషికం తీసుకుంటున్నారు. పాన్ ఇండియా లెవెల్‌కి ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) కూడా సినిమాకు తగిన రెమ్యూనరేషన్(Remunaration) డిమాండ్ చేస్తున్నాడు. కానీ ఓ సినిమా కోసం మాత్రం తారక్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఫ్రెండ్‌షిప్‌తో, అభిమానంతో ఫ్రీగా చేశాడు.

మరి ఆ సినిమా ఏంటో తెలుసా.. “చింతకాయల రవి”(Chintakayala Ravi). అవును చింతకాయల రవి 2008లో వచ్చిన ఈ సినిమాలో వెంకటేష్(Venkatesh) హీరోగా నటించగా, జూనియర్ ఎన్టీఆర్ అతిథి పాత్రలో మెరిచాడు. “షాబాష్ షాబాష్” అనే పాటలో ఆయన కేవలం రెండు నిమిషాలపాటు కనిపించాడు. ఎన్టీఆర్ కనిపించిన ఆ చిన్నపాటి సీన్ ప్రేక్షకులను ఫుల్‌గా ఆకట్టుకుంది. ఈ గెస్ట్ రోల్‌కి జూనియర్ ఎన్టీఆర్ రెమ్యూనరేషన్‌ తీసుకోలేదు. వెంకటేష్‌తో ఉన్న స్నేహంతో చేసాడు.

చింతకాయల రవి సినిమా అప్పుడు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. అనుష్క, మమతా మోహన్‌దాస్ హీరోయిన్లుగా నటించారు. వెంకటేష్ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సినిమాల్లో ఇది ఒకటి. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వార్ 2 సినిమాతో బాలీవుడ్‌ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేయబోతున్నాడు. ఆ తర్వాత దేవర 2 షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌లో డిఫరెంట్ గెటప్‌లో కనిపించనున్నాడు.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *