
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Govt) పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన ‘హరి హర వీరమల్లు(Hari Hara Veeramallu)’ మూవీ టీమ్‌కు తీపికబురు అందించింది. పవన్ సినిమా టికెట్ ధరల పెంపు(Ticket price increase)నకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈ మూవీ జులై 24న పాన్-ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఫ్రొడ్యూసర్స్ మొదట 14 రోజుల పాటు టికెట్ ధరలు పెంచేందుకు అనుమతి కోరగా, ప్రభుత్వం 10 రోజులు (జులై 24 నుంచి ఆగస్టు 2, 2025) మాత్రమే అనుమతించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో లోయర్ క్లాస్ టికెట్‌పై రూ.100, అప్పర్ క్లాస్‌పై రూ.150, మల్టీప్లెక్స్‌లలో రూ.200 వరకు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
ధరల పెంపుపై నిర్మాత ఏఎం రత్నం హర్షం
దీంతో సింగిల్ స్క్రీన్ అప్పర్ బాల్కనీ టికెట్ ధర రూ.297, మల్టీప్లెక్స్ టికెట్ ధర రూ.377గా ఉండనుంది. అదనంగా, జులై 23న రాత్రి 9 గంటలకు ఎంపిక చేసిన థియేటర్లలో ప్రీమియర్ షో(Premiere shows)లకూ అనుమతి ఇవ్వగా, ఈ టికెట్ ధర రూ.600 (GSTతో)గా నిర్ణయించారు.ఈ నిర్ణయం చిత్ర యూనిట్‌లో సంతోషం నింపింది. నిర్మాత ఏఎం రత్నం ఈ పెంపును భారీ బడ్జెట్, VFX, ప్రముఖ తారాగణంతో రూపొందిన ఈ చిత్రానికి ఇది అవసరమని పేర్కొన్నారు.
#HariHaraVeeraMallu Ticket prices AP
9pm shows confirmed on 23rd july with ticket price 600 ✅
Hikes – 100 for lower class
150 for upper class
200 for Multiplex #HHVMBlazeFromJuly23 pic.twitter.com/Th6pgpgJ26— Babai-Abbai అభిమాని 🏏 (@Dhanush42930901) July 19, 2025
కాగా జ్యోతికృష్ణ(Jyithi Krishna) దర్శకత్వంలో, నిధి అగర్వాల్(Nidhi Agharwal), బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం 17వ శతాబ్దపు మొగల్ సామ్రాజ్య నేపథ్యంలో రూపొందింది. అభిమానులు ఈ ధరల పెంపును స్వాగతిస్తూ, సినిమాపై భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. మరోవైపు తెలంగాణ(Telangana)లో కూడా టికెట్ ధరలను పెంచాలని కోరుతూ ప్రభుత్వానికి నిర్మాత అర్జీ పెట్టుకున్నారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన చిత్రం కావడంతో తెలంగాణలో కూడా టికెట్ ధరల పెంపుకు అనుమతి లభించే అవకాశాలు ఉన్నాయి.