Bonalu 2025: బోనాల జాతర.. నేడు స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు

బోనాల పండుగ(Bonala Pandaga) సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు (జులై 21) సాధారణ సెలవు(Holiday) దినంగా ప్రకటించింది. ఈ సెలవు హైదరాబాద్(Hyderabad), సికింద్రాబాద్‌(Secunderabad)తో సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు(Schools), కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు వర్తిస్తుంది. బోనాలు, తెలంగాణలో ఆషాఢ మాసంలో జరుపుకునే సంప్రదాయ హిందూ పండుగ. ఈ పండుగలో మహిళలు బియ్యం, బెల్లం, పసుపు, వేప ఆకులు, కొబ్బరితో అలంకరించిన బోనం (ప్రత్యేక కుండ) సమర్పించి, సంప్రదాయ సంగీతం, నృత్యాలతో ఊరేగింపులు నిర్వహిస్తారు.

Bonalu 2025 | Bonalu Festival (బోనాలు)

జంట నగరాల్లో వైన్ షాప్స్ క్లోజ్

ఇక హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో జరిగే శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర(Sri Ujjain Mahankali Bonala Jathara) సందర్భంగా వైన్ షాపులు(Wines), బార్లను జులై 20, 21న మూసివేయాలని తెలంగాణ సర్కార్(TG Govt) ఆదేశాలు జారీ చేసింది. దీంతో జులై 20న ఉదయం 6 గంటల నుంచి జులై 22 ఉదయం 6 గంటల వరకు తెలంగాణలో మద్యం విక్రయాలను నిలిపివేశారు. వైన్స్ బంద్ కేవలం హైదరాబాద్ జంట నగరాల్లో మాత్రమేనని మెుత్తం రాష్ట్రం అంతగా కాదని అధికారులు తెలిపారు.

Wine Shops Will Be Closed In Erstwhile Warangal-Nalgonda-Khammam Districts For 48 Hours

నేడు మూతపడనున్న బ్యాంకులు

రాష్ట్ర వ్యాప్తంగా సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ప్రజలు బోనాలు జరుపుకుంటారు. అందుకే జులై 21న అంటే సోమవారం తెలంగాణ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు(Banks Holiday)గా రిజర్వు బ్యాంక్ సెలవుల క్యాలెండర్ సూచిస్తోంది. ఆర్బీఐ దేశంలోని వివిధ రాష్ట్రాలు ప్రాంతాల్లో ఉండే స్థానిక పండుగలకు అనుగుణంగా సెలవులను ప్రకటిస్తూనే ఉంటుందని మనందరికీ తెలిసిందే.. ఈ క్రమంలోనే సోమవారం తెలంగాణలో బ్యాంకులు క్లోజ్ కానున్నాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *