2022లో విడుదలైన బ్లాక్‌బస్టర్ కన్నడ చిత్రం ‘కాంతారా(Kantara)’కు ప్రీక్వెల్‌గా రూపొందుతున్న మూవీ ‘కాంతారా చాప్టర్-1(Kantara Chapter-1)’. ‘కాంతారా’ సినిమా భారతీయ సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ‘కాంతారా చాప్టర్-1’ సినిమాకు సంబంధించిన మేకింగ్ గ్లింప్స్ వీడియో కాసేపటి క్రితం (జులై 21), విడుదలైంది. హోంబలే ఫిల్మ్స్(Hombale Films) బ్యానర్‌పై రిషబ్ శెట్టి(Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో, విజయ్ కిరగందూర్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.
Witness the journey behind #KantaraChapter1.#WorldOfKantara ~ A glimpse into the making unfolds at 10:35 AM today.
Stay tuned – https://t.co/BYS4o7Mqo8#Kantara @shetty_rishab @VKiragandur @hombalefilms @HombaleGroup @ChaluveG @AJANEESHB #ArvindKashyap @Banglan16034849… pic.twitter.com/Zr0UwqcKTk— Hombale Films (@hombalefilms) July 21, 2025
మూడేళ్లలో 250 రోజుల కష్టం ఇది..
‘కాంతార జర్నీ’ అంటూ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఇది కేవలం ఒక సినిమా కాదు.. ఒక శక్తి అంటూ రిషబ్ తన జర్నీని వివరించారు. మూడేళ్లలో 250 రోజులపాటు కష్టపడి ఈ మూవీని చిత్రీకరించినట్లు రిషబ్ తెలిపారు. కాగా ఈ మేకింగ్ వీడియో ‘వరల్డ్ ఆఫ్ కాంతారా’ పేరుతో ఉదయం 10:35 గంటలకు విడుదలైంది. ఈ వీడియోలో సినిమా నిర్మాణంలోని కీలక అంశాలు, కదంబ సామ్రాజ్యపు సెట్స్(Kadamba Dynasty Era), రిషబ్ శెట్టి అద్భుత నటన, అలాగే భారీ యుద్ధ సన్నివేశాలు హైలైట్‌గా ఉన్నాయి.. కర్ణాటకలోని కుందాపూర్‌లో నిర్మించిన దేశంలోనే అతిపెద్ద స్టూడియోలో ఈ చిత్రం చిత్రీకరణ జరిగింది. ఈ చిత్రం అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కానుంది. మేకింగ్ వీడియో అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. మరి మీరూ రిషబ్ శెట్టి అద్భుత పోరాటలను చూసేయండి.






