స్టార్ హీరోయిన్ రష్మిక(Rashmika Mandanna) మందన్న ప్రస్తుతం సినీ పరిశ్రమలో చెరగని గుర్తింపు తెచ్చుకుంది. ‘యానిమల్’, ‘పుష్ప 2’, ‘ఛావా’ లాంటి భారీ సినిమాలతో సక్సెస్‌ల పరంపర కొనసాగిస్తూ నిర్మాతలకు లక్కీ హీరోయిన్‌గా నిలుస్తోంది. ఈ విజయాలతో ఆమె రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగింది. ఇప్పుడిలా ఫుల్ బిజీగా కెరీర్ కొనసాగిస్తూ, మరోవైపు తన జీవితం కొత్త దిశగా మళ్లించేందుకు సిద్ధమవుతోంది.
29 ఏళ్ల రష్మిక తాజాగా కొత్త బిజినెస్(Business) ప్రారంభించేందుకు ముందడుగు వేసింది. మొదటి అడుగుగా తల్లి సుమన్ మందన్న(Suman Mandanna) ఆశీర్వాదం తీసుకుంది. “ఈ రోజు నాకు చాలా ముఖ్యమైన షూటింగ్ ఉంది. మీరు చెప్పిన బిజినెస్ ప్రారంభించబోతున్నాను” అంటూ వీడియో కాల్‌లో తన తల్లికి చెప్పినట్లుగా తెలుస్తోంది. తల్లి తన కూతురికి అభినందనలు(Her Mother’s Blessings) తెలిపింది. అయితే రష్మిక ప్రారంభించబోయే వ్యాపారం ఏంటనే విషయంలో మాత్రం ఆమె ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
ఆమె అభిమానులు మాత్రం ఫ్యాషన్ బ్రాండ్ ప్రారంభిస్తుందనే ఊహలో ఉన్నారు. ఇప్పటికే అనేక స్టార్ హీరోయిన్లు తమ సొంత ఫ్యాషన్ లేబుల్స్ ప్రారంభించిన నేపథ్యంలో, రష్మిక కూడా అదే దిశగా అడుగులేస్తుందని చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆస్తుల విలువ 60 కోట్ల రూపాయలకుపైగా ఉందని సమాచారం. ఒక్కో సినిమాకు కోట్లల్లో పారితోషికం తీసుకుంటూ, ఇప్పుడు ఆ సంపదను వ్యాపారంలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవడం ఆమె దూరదృష్టిని చూపిస్తోంది.
View this post on Instagram






