భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్(Jagdeep Dhankhar) ఆరోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు నిన్న (జులై 21) రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Draupadi Murmu)కు రాజీనామా లేఖ(Resignation letter) సమర్పించిన ఆయన, రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(A) ప్రకారం తక్షణమే అమలులోకి వచ్చేలా పదవి నుంచి తప్పుకున్నారు. 2022 ఆగస్టు 11న ఉపరాష్ట్రపతి(Vice-President)గా బాధ్యతలు స్వీకరించిన ధన్‌ఖడ్, తన ఐదేళ్ల పదవీ కాలం మరో రెండేళ్లు మిగిలి ఉండగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల(Parliament Monsoon Sessions) మొదటి రోజున రాజ్యసభ అధ్యక్షుడి(President of the Rajya Sabha)గా వ్యవహరించిన కొన్ని గంటల్లోనే ఆయన రాజీనామా చేయడం అందరికీ ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది.

దేశ భవిష్యత్ పట్ల విశ్వాసం ఉంది: ధన్‌ఖడ్
కాగా ధన్‌ఖడ్ తన రాజీనామా లేఖలో రాష్ట్రపతి ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi), మంత్రి మండలి, పార్లమెంటు సభ్యులకు వారి మద్దతు, సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన పదవీ కాలంలో భారతదేశం ఆర్థిక పురోగతి, అభివృద్ధిని చూసినందుకు గర్వంగా ఉందని, దేశం భవిష్యత్తు పట్ల విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ఆయన ఆరోగ్య సమస్యలు(Health Issues), ముఖ్యంగా ఈ ఏడాది మార్చిలో గుండె సంబంధిత సమస్యల(Heart related problems)తో ఎయిమ్స్‌లో చికిత్స, గత నెలలో నైనిటాల్ విశ్వవిద్యాలయ కార్యక్రమంలో స్పృహ కోల్పోవడం వంటి ఘటనలు ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది.
Jagdeep Dhankhar resigns pic.twitter.com/7l5EQ50mh8
— राजस्थानी ट्वीट (@8PMnoCM) July 21, 2025
60 రోజుల్లో కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక
ధన్‌ఖడ్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నిక(Election of the Vice President) కోసం 60 రోజుల్లో కొత్త ఎన్నిక జరగనుంది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్పర్సన్ తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తారు. ధన్‌ఖడ్ గతంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్(Supreme Court Senior Advocate)గా పనిచేశారు. ఆయన రాజీనామాపై కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్, కపిల్ సిబల్ వంటి వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, ఆయన ఆరోగ్యం కోసం శుభాకాంక్షలు తెలిపారు. మరికొందరు రాజకీయ కారణాలు ఉండొచ్చని అనుమానిస్తున్నారు.






