
సోషల్ మీడియా(Social Media) అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలపై ట్రోలింగ్ ఒక ట్రెండ్లా మారింది. ఒక్కోసారి సినిమాలు విడుదలైన తర్వాత, ఒక్కో దృశ్యం లేదా డైలాగ్‌పై నెగటివ్ కామెంట్స్ వెల్లువెత్తుతుంటాయి. ముఖ్యంగా హీరోయిన్ల(Heroines)ను ఎక్కువగా టార్గెట్(Target) చేస్తూ ఉంటారు. ఈ ట్రోలింగ్ ఒక్క సినీ ప్రపంచానికే పరిమితం కాదు. యాంకర్లు, సింగర్లు, మోడల్స్, ఇన్‌ఫ్లుయెన్సర్లు ఇలా అందరూ దీని బారిన పడుతున్నారు. కొందరు సెలబ్రిటీలు ఈ ట్రోలింగ్‌ను ఎదుర్కొంటూ ధైర్యంగా నిలబడుతున్నప్పటికీ, మరి కొంతమంది అయితే సోషల్ మీడియా నుంచి విరమించుకుంటున్నారు.
సోషల్ మీడియాలో చేసిన పోస్టులు అన్నింటినీ ఆధారంగా తీసుకొని అసభ్యమైన వ్యాఖ్యలు చేస్తూ ట్రోల్ చేయడం కరెంట్ ట్రెండ్ అయిపోయింది. ముఖ్యంగా హీరోయిన్ల వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయడం తీవ్రంగా పెరిగిపోయింది. కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల్లో అభ్యంతరాలు కలిగించడమే కాకుండా, హీరోయిన్‌ల పరువు తీయడంతో పాటు తీవ్రమైన ట్రోలింగ్‌కు గురిచేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో డైరక్టర్స్(Directors) కొంతమంది.. హీరోలు హీరోయిన్ల కాళ్ళు పట్టుకునే సీన్లను చేయిస్తున్నారు. “అనిమల్” సినిమాలో రష్మిక మందన్నా కాళ్లు రణబీర్ కపూర్ పట్టుకునే సీన్ పెద్ద దుమారానికే దారి తీసింది. ఆ సీన్ గురించి ప్రేక్షకుల నుంచి, సోషల్ మీడియా వరకు తీవ్రంగా విమర్శలు వచ్చాయి. దీనిపై రష్మికను ట్రోల్ చేస్తూ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేశారు. ఇదే పరిస్థితి “పుష్ప 2″లోని “ఫీలింగ్స్ సాంగ్” లోనూ కనిపించింది, అక్కడ అల్లు అర్జున్ చాలాసార్లు రష్మిక మందన్న కాళ్లు పట్టుకున్నాడు.
ఇలాంటి ట్రోలింగ్, నెగెటివ్ రెస్పాన్స్‌లు హీరోలకు పెద్దగా ఇబ్బంది కలిగించకపోయినా, హీరోయిన్‌లకు మాత్రం తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కొంతమంది హీరోయిన్లు ముందుజాగ్రత్తగా నిర్ణయం తీసుకున్నారు. ఇకపై “హీరో కాళ్లు పట్టే సీన్స్ మేము చేయలేము. మరీ ముక్యంగా హద్దులు మీరే సన్నివేశాల్లో అసలే చేయలేము” అంటూ డైరెక్టర్స్‌కి ఓపెన్‌గా చెబుతున్నారట. సినిమాలకు కమిట్ అయ్యే ముందే ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.