బాలీవుడ్(Bollywood) బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) టాలీవుడ్(Tollywood)లో అడుగుపెట్టిన చాలా తక్కువ టైమ్‌లోనే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఓ వైపు హిందీ సినిమాలు, మరోవైపు తెలుగు సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. ఎన్టీఆర్(Jr.NTR) ‘దేవర’ మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ, తన అందం, నటనతో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. ఇప్పుడు ఆమె రామ్ చరణ్ సరసన ‘పెద్ది’( ‘Peddi’) సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.
‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ తీసుకుంటోన్న పారితోషికం(Remunaration) ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ‘దేవర’ సినిమా కోసం జాన్వీ రూ.5 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ‘పెద్ది’ సినిమా కోసం జాన్వీ రెమ్యూనరేషన్‌ను లక్ష పెంచి ఏకంగా రూ.6 కోట్లు తీసుకుంటోందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి.
భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘ఉప్పెన’ మూవీతో నేషనల్ అవార్డు గెలుచుకున్న సనా బుచ్చిబాబు(Sana Buchi Babu) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జోడిగా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు (మీర్జాపూర్ ఫేమ్) వంటి నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ మేజిషియన్ ఏఆర్ రెహమాన్ స్వరాలు అందిస్తున్నారు. ‘పెద్ది’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే సినిమా నుంచి మరిన్ని అప్‌డేట్స్ రావాల్సి ఉంది.
View this post on Instagram






