
భారత్(India)లో బంగారా(Gold)నికి ఎనలేని డిమాండ్(Demand) ఉంటుంది. ముఖ్యంగా మహిళలు గోల్డ్ జువెల్లరీని ఎక్కువగా పండగలు, శుభకార్యాలు, వివాహాలు, ఇతర వేడుకల సమయాల్లో కొని ధరించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇది మన దేశంలో సంప్రదాయంగా వస్తోంది. ఇంకా బంగారం పెట్టుబడులకు కూడా మంచి సాధనంగా పని చేస్తుంది. అందుకే.. ఎప్పుడూ ఇక్కడ డిమాండ్ తగ్గదు. అయితే గత కొంత కాలంగా అంతర్జాతీయంగా మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ పరిస్థితులు(Middle-East War Crisis), అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పలు దేశాల దిగుమతులపై భారీగా సుంకాలు(Tariffs) విధించిన కారణంగా అనిశ్చితి ఏర్పడి సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారానికి మంచి డిమాండ్ వచ్చింది.
సుంకాల డెడ్‌లైన్ దగ్గరపడుతున్న క్రమంలో..
అయితే ఇప్పుడు మళ్లీ (ఆగస్ట్ 1) సుంకాల డెడ్‌లైన్ దగ్గరపడుతున్న క్రమంలో గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. చాలా దేశాలపై ట్రంప్ ఇంకా చర్చలు సాగిస్తున్నారు. యూరోపియన్ యూనియన్‌తో ప్రస్తుతం చర్చలు జరుగుతుండగా.. ఆ దేశంపై 20 శాతం వరకు దిగుమతి సుంకాల్ని విధిస్తారని తెలుస్తోంది. ఇంకా భారత్‌తో కూడా అమెరికా వాణిజ్య ఒప్పందం కొలిక్కిరాలేదు. ఈ క్రమంలోనే డాలర్ విలువ కోల్పోతుండగా గోల్డ్ పుంజుకుంటోంది. దీంతో భారత్‌లో గత మూడు రోజులుగా పసిడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
కాగా బుధవారం (July 23) హైదరాబాద్(HYD)లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.950 పెరిగి రూ.93,800కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,040 పెరిగి రూ.1,02,330కి చేరింది. ఇక కేజీ సిల్వర్(Silver Price) ధర రూ. 1,000 పెరిగి రూ.1,29,000గా కొనసాగుతోంది. ఆకాశన్నంటున్న ధరలను చూసి కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. కాగా తెలుగురాష్ట్రాల్లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇవే ధరలు ఉన్నాయి.