HHMV Review & Rating: మొఘలుల ఆరాచకాలపై ‘వీరమల్లు’ పోరాటం ఎలా ఉందంటే?

పవన్(Pawan Kalyan) ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానలకు ఆ ఆనందం దక్కింది. సుదీర్ఘ కాలం తర్వాత పవన్ నటించిన తొలి పాన్-ఇండియా పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘హరి హర వీరమల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్(Hari Hara Veeramallu: Part 1 – Sword vs. Spirit)’ చిత్రం థియేటర్లలోకి వచ్చేసింది. ఈ మూవీ ఇవాళ (జులై 24) విడుదల కానుండగా.. బుధవారం (జులై 23) రాత్రే ప్రీమియర్ షో(Premiere Shows)లు పడ్డాయి. క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi), జ్యోతి కృష్ణ(Jyothi Krishna) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్‌లో రూపొందిన ఈ చిత్రం 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో యోధుడు వీరమల్లు కథగా తెరకెక్కింది. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చిన సినిమా కావడం, ప్రమోషన్స్(Promotions) ఈవెంట్స్‌లోనూ పవర్ స్టార్ నేరుగా పాల్గొనడంతో మూవీపై హైప్ బాగా పెరిగింది. మరి ‘వీరమల్లు’ ఆ అంచనాలను అందుకున్నాడా? తెరపై ఎలాంటి పవర్ చూపించాడో ఓ లుక్ వేద్దామా..

Hari Hara Veera Mallu : హరిహర వీరమల్లు ట్రైలర్ డేట్ ఫిక్స్ అయింది | Pawan Kalyan Hari Hara Veera Mallu Trailer will release this day

కథేంటంటే..

వీరమల్లు (Pawan Kalyan) ఒక అనాథ బిడ్డగా, దొంగల గుండెల్లో భయం పుట్టించే ధీరుడిగా మారి, మొఘల్ సైన్యాధికారుల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడుతాడు. స్వాతంత్ర్యం కోసం అతని పోరాటం, ధర్మం కోసం అతని అచంచలమైన నీతి కథాంశంగా ఉంటుంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు (Bobby Deol) ఢిల్లీ పీఠంపై కూర్చొని అనేక దురాగతాలకి పాల్పడుతూ పాలన కొనసాగిస్తుంటాడు. మత మార్పిడి(Conversion) కోసం దేశ ప్రజలని బలవంతం చేస్తుంటాడు. అందుకు ఒప్పుకోకుండా హిందువులుగానే జీవించేవాళ్ల నుంచి పన్ను వసూలు చేస్తుంటాడు. మరోపక్క ప్రజలు ఆకలితో అలమటిస్తున్నా, వాళ్లని పట్టించుకోకుండా దేశ సంపదని తెల్లదొరలు దోచుకెళ్తుంటారు. ఇక వీరమల్లు ధనవంతుల సొమ్ము ఎత్తుకొచ్చి పేదలకు పంచుతాడు. ఈ విషయం తెలుసుకున్న కుతుబ్ షాహీ ఢిల్లీలో ఔరంజేబు(Aurangzeb) సింహాసనంపై ఉన్న కోహినూర్ వజ్రాన్ని(Kohinoor diamond) తీసుకొచ్చే బాధ్యతని అతడికి అప్పజెబుతాడు. ఏ కారణాలతో అందుకు వీరమల్లు ఒప్పుకున్నాడు? హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే క్రమంలో ఆయనకి ఎదురైన పరిస్థితులు ఎలాంటివి?ఈ కథలో పంచమి (Nidhi Agarwal) ఎవరు? ఆమెకీ వీరమల్లుకూ సంబంధం ఏంటి? పటిష్ఠమైన ఔరంగజేబు సామ్రాజ్యంలోకి వీరమల్లు ఎలా వెళ్లాడు? వంటి అంశాలు తెలియాలంటే బిగ్ స్ర్కీన్‌పై మూవీ చూడాల్సిందే.

HHMV: హరి హర విరమల్లు 2 గంటల 42 నిమిషాలు | Mahaa News

ఎవరెలా నటించారంటే..

పవన్ కళ్యాణ్ తన నటనతో, ముఖ్యంగా యాక్షన్ సన్నివేశా(Action Scenes)ల్లో ఆకట్టుకున్నాడు. గుర్రపు స్వారీ, ఖడ్గ యుద్ధాలు అతని శక్తిమంతమైన పాత్రకు న్యాయం చేశాయి. ఒక్కమాటలో చెప్పాలంటే వన్ మ్యాన్ షో కనబరిచాడు. అటు నిధి అగర్వాల్ పంచమి పాత్రలో సొగసైన నటనతో మెప్పించింది, అయితే ఆమె పాత్రకు పరిమిత స్కోప్ ఉంది. బాబీ డియోల్, అయితే ఫస్టాఫ్‌లో కనిపించినంత బలంగా సెకండాఫ్‌లో ఆ పాత్రని చూపించలేకపోయారు. ఇక దివంగత నటుడు కోట శ్రీనివాసరావు(Kota Srinivas Rao) చిన్న పాత్రలో మెరుస్తారు. సత్యరాజ్, అనూపమ్ ఖేర్ తమ పాత్రల్లో బలమైన స్క్రీన్ ప్రెజెన్స్ చూపించారు. అనసూయ, పూజిత పొన్నాడ ఓ పాటలో సందడి చేశారు.


సాంకేతికంగా గూస్‌బంప్స్ ఇచ్చే సన్నివేశాలివే..

ఎం.ఎం. కీరవాణి(Keeravani) సంగీతం, ముఖ్యంగా ‘అసుర హననం’ పాట, సినిమాకు బలం. స్క్రీన్‌పై గూస్‌బంప్స్ ఇచ్చే సన్నివేశాలను అందించింది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ 17వ శతాబ్దపు వాతావరణాన్ని అద్భుతంగా చూపించింది. అయితే కథలో బలమైన ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం, VFX లోపాలు నిరాశనిచ్చాయి. కొందరు గుర్రపు స్వారీ సన్నివేశాలను ట్రోల్ చేశారు. కాగా రూ.250 కోట్ల బడ్జెట్‌(Budget)తో రూపొందిన ఈ చిత్రం భారీ సెట్స్, చార్మినార్‌ను తలపించే నిర్మాణాలతో దృశ్య విజయాన్ని సాధించింది. కథలో కొన్ని లాజిక్ లోపాలు, వీఎఫ్‌ఎక్స్ లోపాలపై విమర్శలు ఉన్నప్పటికీ, పవన్ అభిమానులకు ఈ సినిమా విజువల్ ట్రీట్. క్లైమాక్స్ ఫైట్(Climax Fight) సన్నివేశాలు థియేటర్‌లో ఉత్సాహాన్ని నింపాయి.

రేటింగ్: 2.75/5

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *